ఎపిలో జగన్‌ది తుగ్లక్‌ పాలన

మండిపడ్డ కాంగ్రెస్‌ నేత తులసిరెడ్డి
కడప,సెప్టెంబర్‌6  (జనం సాక్షి ) :  ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌ 100 రోజుల పాలన అస్తవ్యస్తంగా ఉందని కాంగ్రెస్‌ నేత తులసిరెడ్డి ధ్వజమెత్తారు. మాట తప్పి మడమ తిప్పిన వ్యక్తి మన ముఖ్యమంత్రి అంటూ విమర్శించారు. జగన్‌ది రివర్స్‌ పాలన, తుగ్లక్‌ పాలన అని మండిపడ్డారు. కేసీఆర్‌తో లాలూచీ పడి ఏపీకి తీవ్ర అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. ఒక్క హావిూ కూడా అమలు దిశగా వెళ్లడం లేదని చెప్పారు. పరిపాలన చేతకాని
వ్యక్తి.. సీఎం అయితే ఇలానే ఉంటుందని వ్యాఖ్యానించారు. మాటలు కోటలు దాటాయన్నారు. ఏ పనీ కావడం లేదన్నారు. ప్రజలు ఎన్నో ఆశలతో గద్దెనెక్కిస్తే కేవలం మాటలతో కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు.