Tuesday, 3 November 2026

యువ కన్నడ నటుడు హేమంత్‌ మృతి

బెంగళూరు,(జనంసాక్షి): యువ కన్నడ నటుడు హేమంత్‌(27) గుండెపోటుతో బుధవారం మృతి చెందారు. బెంగళూరులోని ప్రైవేట్‌ అతడు కన్ను మూశాడని హేమంత్‌ కుటుంబానికి చెందిన సన్నిహితుడొకరు వెల్లడించారు.
నిన్న సాయంత్రం జిమ్‌లో వ్యాయామం చేస్తుండగా హేమంత్‌కు ఛాతిలో నొప్పి వచ్చింది. వెంటనే అతడిని చికిత్స కోసం సమీపంలోని ఎంఎస్‌ రామయ్య ఆస్పత్రికి తరలించారు. గుండెపోటుతో ఈ ఉదయం అతడు తుదిశ్వాస విడిచారు. అని ఆయన తెలిపారు. హేమంత్‌ గత చిత్రం విజయవంతం కావడంతో పెద్ద నిర్మాణ సంస్థలో అతడికి తదుపరి చిత్రం చేసే అవకాశం వచ్చిందని చెప్పారు.
హేమంత్‌ ‘నెనాపినాంగళ’ నిర్మాత జి. రామకృష్ణ తనయుడు .హేమంత్‌ మరణంతో కన్నడ చిత్రసీమ దిగ్భ్రారతికి గురయింది. అతడి మృతి పట్ల సంతాపం తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *