హైదరాబాద్: యూఏఈలో జరుగబోయే 5వ వార్షిక పెట్టుబడుల సదస్సుకు రావాలని మంత్రి కల్వకుంట్ల తారక రామారావుకు ఆహ్వానం అందింది. యూఏఈ ఉపాధ్యక్షుడు మహ్మద్ రషీద్ మకోటం సదస్సుకు కేటీఆర్‌ను ఆహ్వానించారు. ప్రపంచంలో ఆకర్షణీయ పెట్టుబడుల ప్రాంతాలపై ఈ సదస్సులో చర్చ జరుగనుంది. తనను సదస్సుకు ఆహ్వానించడంపట్ల మంత్రి హర్షం వ్యక్తం చేశారు. సదస్సు ద్వారా తెలంగాణలోని అవకాశాలను మంత్రి ప్రపంచానికి పరిచయం చేయనున్నారు. ఈ సదస్సుకు 140 దేశాల నుంచి ప్రతినిధులు హాజరుకానున్నారు.




