మల్కాజిగిరి.జనంసాక్షి.ఏప్రిల్ 14భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 132వ జయంతి సందర్భంగా గౌతమ్ నగర్ డివిజన్ మల్లికార్జున్ నగర్ లోని సిపిఐ కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈసందర్భంగా మల్కాజిగిరి మండల కార్యదర్శి యాదయ్య గౌడ్ మాట్లాడుతూ. రాజ్యాంగాన్ని అమలు చేస్తామని రాజ్యాంగం పై ప్రతిజ్ఞ చేసి గద్దెనెక్కిన పాలకులు రాజ్యాంగాన్ని అమలు పరచడంలో పూర్తిగా వైఫల్యం చెందాలని విమర్శించారు.ఈ కార్యక్రమంలో సిపిఐ మండల సహాయ కార్యదర్శి.కాసర్ల నాగరాజు,యాదగిరి, రాములు.ప్రభాకర్.లింగం,బాలయ్య, మహేందర్,నరసింహ,రాములు తదితరులు పాల్గొని నివాళులర్పించారు.




