Thursday, 5 November 2026

యూపీలో కుప్పకూలిన భవనం: 13కు చేరిన మృతుల సంఖ్య…!

building collopes
  ఉత్తర ప్రదేశ్‌   జ‌నంసాక్షి:
ఉత్తర ప్రదేశ్‌లో భవన కూలిన ప్రమాదంలో మృతుల సంఖ్య 13కు పెరిగింది. వారణాసి – చందౌలీ సరిహద్దు ప్రాంతం దుల్హీపూర్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న మూడంతస్తుల భవనం కుప్పకూలిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో శిథిలాల్లో చిక్కుకుని 12 మంది సజీవ సమాధి అయ్యారు. వారిలో ఆరుగురు మహిళలు, ఇద్దరు పిల్లలున్నారు. మరో ఇద్దరు పిల్లలు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. 
వేకువజాము కావడంతో నిద్రలో ఉన్నవారి హాహాకారాలు విన్న ఇరుగుపొరుగు వారు ఇచ్చిన సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక దళ సిబ్బంది, ప్రకృతి వైపరీత్యాల సహాయ దళం (ఎన్డీఆర్‌ఎఫ్) జవాన్లు శిథిలాలను తొలగించి, 12 మంది మృతదేహాలను వెలికితీశారు. తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరు బాలలను వారణాసి ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ ఒక బాలుడు మృతి చెందాడు. దీంతో మృతుల సంఖ్య 13గా పెరిగింది. అధికారులు గాలింపు పనులను కొనసాగిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *