సంక్షేమ కార్యక్రమంలో భాగంగా సింగరేణి సంస్థ కంపెనీ వ్యాప్తంగా యోగా ధ్యాన కేంద్రాలను ఏర్పాటు చేసిందని,సింగరేణి జిఎం కోఆర్డినేషన్ సురేష్ అన్నారు.జూన్ 21న జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు యోగా సంబంధ కార్యక్రమాలను సింగరేణి వ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లు జనరల్ మేనేజర్ కోఆర్డినేషన్ ఎం. సురేష్ పేర్కొన్నారు. బుధవారం నాడు హైదరాబాద్ సింగరేణి భవన్లో ‘ రామచంద్ర మిషన్’ వారి అనుబంధ సంస్థ అయిన హార్ట్ ఫుల్ నెస్ ఇన్స్‌స్టిట్యూట్ నిర్వహకులతో గత మూడు రోజుల పాటు నిర్వహించిన యోగ ధ్యాన శిబిరం ముగింపు సమావేశంలో ఆయన ప్రసంగించారు.మూడు రోజులు పాటు జరిగిన శిబిరంలో విధి నిర్వహణలో కలిగే ఒత్తిడిని తగ్గించుకోవడం కోసం ప్రాణయామ, ధ్యాన, ఆత్మ శుద్ధి తదితర ప్రక్రియలను సులభ పద్ధతిలో నిర్వాహకులు బోధించారు. నేటి ఆధునిక ప్రపంచంలో ఒత్తిడిని జయించాలంటే యోగా ధ్యానం మాత్రమే మంచి సాధనాలని వారు పేర్కొన్నారు. ఇంటి వద్ద కానీ బయట గాని అనుసరించ దగ్గర సులువైన పద్ధతులను బోధించారు. ‘హార్ట్ ఫుల్ నెస్ ఇన్స్‌స్టిట్యూట్’ వారు స్వచ్ఛందంగా సింగరేణి భవన్‌లోని ఉద్యోగులు, అధికారులకు యోగ మరియు ధ్యానం పైన అవగాహన కలిగించడంపై కృతజ్ఞతలు తెలియజేస్తూ నిర్వాహకులు శ్రీమతి శారద, డి.ఎస్.వి. ప్రసాద్‌లను ఘనంగా సన్మానించారు.జనరల్ మేనేజర్ కోఆర్డినేషన్ ఎం. సురేష్‌తో పాటు మేనేజర్ ఎన్. భాస్కర్, వివిధ విభాగాల అధికారులు ఉద్యోగులు, సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.




