Thursday, 5 November 2026

సుందిళ్లలో లబ్ధిదారులకు అవగాహన సదస్సు

 

 

 

 

జనంసాక్షి, కమాన్ పూర్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గొర్రెల పంపిణీ కార్యక్రమంలో రెండో విడతకు చెందిన లబ్ధిదారులతో రామగిరి మండల వెటర్నరీ డాక్టర్ దుర్గ ప్రసాద్ రెడ్డి, కమాన్పూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ దాసరి రాజలింగు అవగాహన సదస్సు నిర్వహించారు. అనంతరం నూతనంగా మార్కెట్ కమిటీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన దాసరి రాజలింగు ని వెటర్నరీ డాక్టర్ మరియు సిబ్బంది సన్మానించారు. ఈ కార్యక్రమంలో వెటర్నరీ సిబ్బంది మల్లికార్జున్, నారాయణ, లబ్ధిదారులు పాల్గొన్నారు