Thursday, 5 November 2026

సైనిక్ మరియు సిఓఈ సెట్ ఫలితాల్లో తిరుగులేని విజయాలు నమోదుచేసిన  విద్యార్థులు.

 

 

 

 

 

బెల్లంపల్లి, ఏప్రిల్ 12, (జనంసాక్షి )తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నడుస్తున్న సైనిక్ స్కూల్ మరియు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ లలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం అడ్మిషన్ల కోసం వేరువేరుగా నిర్వహించిన సిఓఈ సెట్-2023 ఫలితాల్లో తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల బెల్లంపల్లి విద్యార్థులు ఏకంగా 12 మంది సీట్లు సాధించి ప్రభంజనం సృష్టించారు.గురుకులంలో ప్రస్తుతం పదవ తరగతి చదువుతున్న 65 మంది విద్యార్థులు ఈ సెట్ లకు హాజరు కాగా వారిలో 12 మంది విద్యార్థులు ప్రతిభ చూపి సీట్లు సాధించారు. రాష్ట్రవ్యాప్తంగా వేల మంది పోటీపడిన సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ టెస్ట్ లో ముగ్గురు విద్యార్థులు, ఐఐటి నీట్ శిక్షణ కేంద్రాలైన సిఓఈలలో 9 మంది విద్యార్థులు కలిపి మొత్తం 12 మంది సీట్లు సాధించినట్లు ప్రిన్సిపల్ ఐనాల సైదులు తెలిపారు.రుక్మాపూర్ సైనిక్ స్కూల్ లో సీట్లు సాధించిన విద్యార్థులు వీరే.దుర్గం సంజయ్ కుమార్ (యంపిసి), ఎస్కిల్ల రిషిక్ (యంపిసి), కాంపెల్లి జస్వంత్ (యంపిసి)నాలుగు స్టేట్ లెవెల్ సిఓఈ లలో సీట్లు సాధించిన విద్యార్థులు.ఐల సాయిరాం (బైపిసి,గౌలిదొడ్డి),గొర్లపల్లి సాత్విక్ ( బైపిసి,గౌలిదొడ్డి),కాసర్ల భువన్ తేజ (బైపిసి, గౌలిదొడ్డి),దుగుట హరిష్( యంపిసి, గౌలిదొడ్డి),ముడుమడిగెల సాయి చరణ్ తేజ (యంపిసి, గౌలిదొడ్డి),కొండగొర్ల సిద్దార్థ (యంపిసి ,చిలుకూర్),ఉదురుకోట శ్రీహర్షన్( బైపిసి,చిలుకూర్),ఇల్లoదుల మణితేజ ( బైపిసి,చిలుకూర్),కనుకుంట్ల రామ్ చరణ్ తేజ (యంపిసి,షేక్ పేట),ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ ప్రత్యేక ప్రణాళికతో నిరంతరం విద్యార్థులను ఉత్తమంగా తీర్చిదిద్దాలన్న డెడికేషన్ తో పనిచేసిన సిబ్బంది సమిష్టి కృషి అని అన్నారు. ప్రస్తుతం స్టేట్ లెవెల్ లో నడుస్తున్న నాలుగు బాయ్స్ మూడు గర్ల్స్ సిఓఈ లలో అడ్మిషన్లు వచ్చిన విద్యార్థుల ఫలితాలు మాత్రమే వెల్లడించారని మిగిలిన రీజనల్ లెవెల్ 31 సిఓఈ లలో అడ్మిషన్లకు సంబంధించిన ఫలితాలు త్వరలో వెల్లడించనున్నట్లు సంక్షేమ గురుకులాల కార్యదర్శి డి రోనాల్డ్ రోస్ ఐఏఎస్ తెలిపినట్లు ప్రిన్సిపల్ వివరించారు.బెల్లంపల్లి సిఓవి విద్యార్థులకు ఎమ్మెల్యే అభినందన.పరీక్షలు ఏవైనా ఉత్తమ ఫలితాలే ధ్యేయంగా పనిచేస్తున్న బెల్లంపల్లి సిఓఐ ప్రిన్సిపల్ మరియు బోధన సిబ్బందికి బెల్లంపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు దుర్గం చిన్నయ్య అభినందనలు తెలిపారు ఏకంగా 12 మంది విద్యార్థులు సైనిక్ స్కూల్ మరియు పలు సిఓఈ ల్లో సీట్లు సాధించిన సందర్భంగా చిన్నయ్య ఫోన్ ద్వారా విద్యార్థులకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఆదిలాబాద్ రీజియన్ సాంఘిక సంక్షేమ గురుకులాల రీజనల్ కోఆర్డినేటర్ కొప్పుల స్వరూప రాణి ఫోన్ ద్వారా విద్యార్థులకు అభినందనలు తెలిపారు. విద్యార్థుల విజయాలు పలువురికి స్ఫూర్తినిస్తున్నాయని ఈ సందర్భంగా ఆమె ప్రశంసించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు స్వీట్లు పంచుకొని అభినందనలు తెలుపుకున్నారు.ఈకార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ కోట రాజకుమార్ ఉపాధ్యాయులు కొక్కుల రాజేశ్వర్, అనుముల అనిరుద్, దత్త ప్రసాద్, వరమని ప్రమోద్ కుమార్, ఆర్ రామారావు, ప్రేమలత, సమందర్, తేజస్వి, తిరుపతి, సంతోష్ తదితరులు పాల్గొన్నారు