యోగ రోగనిరోధక శక్తిని పెంచుతుంది:ఎంపీపీ

యోగ నిత్యజీవితంలో ఒక భాగంగా రోజు వారిగా క్రమం తప్పకుండా యోగ చేస్తేనే ఆరోగ్యంగా ఉంటారని ఎంపీపీ రాథోడ్ సజన్ అన్నారు.మంగళవారం రోజున అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని మండలంలోని వివిధ గ్రామల పాఠశాలలో ఘనంగా నిర్వహించారు.మండల కేంద్రంలోని రైతు వేదికలో పలువురు మండల ప్రజాప్రతినిధులు ఆయా శాఖల అధికారులు వడూర్ గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వాగ్దరి ప్రాథమిక పాఠశాల తోపాటు ఆయా స్కూల్ విద్యార్థులతో యోగ ఆసనాలు చేయించి యోగ ప్రాముఖ్యత గురించి వివరించారు.ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు రోజు తప్పనిసరి యోగ చేయాలని కోరారు.యోగ ఎంతగానో ఆరోగ్యానికి మేలు చేస్తుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ పెంట వెంకట రమణ ఎంపిడిఓ అబ్దుల్ సమద్ ఎంపీవో శోభన ప్రధానోపాధ్యాయులు స్థానిక ప్రజలు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.