కొండమల్లేపల్లి ఏప్రిల్ 11 జనంసాక్షి న్యూస్ : కొండమల్లేపల్లి మండల కేంద్రంలో మంగళవారం నాడు ఎన్ ఎస్ యు ఐ తెలంగాణ స్టేట్ కో-ఆర్డినేటర్ ఎండి ఖదీర్ మాట్లాడుతూ నాటి టిఆర్ఎస్ (నేటి బిఆర్ఎస్) పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముస్లిం మైనారిటీలకు 12% రిజర్వేషన్ కల్పిస్తాం అని చెప్పి ఓట్లు వేపించుకొని అధికారంలోకి వచ్చిన బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ముస్లిం మైనారిటీలకు12% రిజర్వేషన్ ల గురించి ఉసుకుడా ఎత్తడం లేదని, అధికారంలోకి వచ్చి దాదాపుగా 8 సంవత్సరలు గడుస్తున్నా ఎన్నికల్లో ఇచ్చిన హామీల గురించి మాటకూడా ఎత్తకుండా దాటవేస్తూ రంజాన్ తోఫా, ఇఫ్తార్ విందులతో ముస్లిం వర్గాలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు రంజాన్ తోఫా విందులతో ముస్లిం మైనార్టీ వర్గాలకు ఒరిగేదేంలేదని తెలంగాణ రాష్ట్రంలోని పార్లమెంట్ స్థానాల్లో, రాజ్యసభ స్థానాల్లో ఒక్క ఎంపీ సీటు కూడా ముస్లిం వర్గాలకు ఇవ్వలేదని ఆరోపించారు ముస్లిం వర్గాలను కేవలం ఓటు బ్యాంకు పరంగానే మాత్రమే వాడుకుంటున్నారని చట్టసభలకు వెళ్లే అవకాశం ఇవ్వడం లేదని కేంద్రంలో ఉన్న బిజెపి పై యుద్ధం అంటూనే అంతర్గతంగా బిజెపితో సత్సంబందాలు నెరవేరిస్తున్నారని ఢిల్లీలో ఒకరకంగా రాష్ట్రంలో ఒక రకంగా ఉంటూ రాష్ట్ర ప్రజలను గందరగోళంలో నెట్టుతున్నారని విమర్శించారు ఎక్కడ చూసినా లీకులతో విద్యార్థులను గందరగోళంలో నెట్టారని గ్రూప్1 గ్రూప్ 2 పరీక్షలు కూడా సరిగా నిర్వహించడం లేదని బిఆర్ఎస్ పరిపాలనలో ప్రజల విసిగిపోయారని ఇంకా సెంటిమెంట్ రాజకీయాలతోనే పబ్బం గడుపుతున్నారని విమర్శించారు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసినా బెల్ట్ షాపులు విచ్చలవిడిగా విస్తరిస్తున్నాయని ఇంకా ప్రజలు నష్టపోవడానికి మద్యం షాపులు 24 గంటలు తెరిచే ఉంటాయని ఎన్నికల జిమికుల్లో భాగంగా రాష్ట్ర ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారని ఆరోపించారు నిత్యవసర ధరలు ఉచ్చలవిడిగా పెంచుతూ పేద ప్రజల నడ్డి విరుస్తున్నారని అన్నారు ఇప్పటికైనా ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ముస్లిం మైనారిటీలకు 12% రిజర్వేషన్ కల్పించాలి అని లేదంటే వచ్చే శాసనసభ ఎన్నికల్లో బిఆర్ఎస్ ప్రభుత్వనికి తగిన బుద్ధి చెప్తం అని వారు హెచ్చరించారు




