Thursday, 5 November 2026

వాకర్స్  ఆధ్వర్యంలో ఘనంగా పూలే జయంతిమంచిర్యాల జిల్లా కేంద్రంలోని రాముని చెరువు కట్ట196వ జయంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు.

 

 

 

 

 

 

ఈ సందర్భంగా పూలే చిత్రపటానికి పలువురు వాకర్ సభ్యులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.. పూలే  ఆశయాలను కొనసాగించాలని నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఫూలే సామాజిక ఉద్యమకారుడు, సంఘసంస్కర్త, బలహీన బడుగు వర్గాల అణగారిన కులాల ఆశాజ్యోతి అని కొనియాడారు.
సమాజంలో అనిచి వేతకు,  ఆరాచకాల వ్యతిరేకంగా “సత్యశోధక సంస్థను” స్థాపించి దేశ వ్యాప్తంగా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చిన గొప్ప శక్తి అని అన్నారు. అంటరానితనానికి, వ్యతిరేకంగా మరియు విద్యావ్యాప్తికి, విశేష కృషి చేసిన వ్యక్తి పూలే అని కొనియాడారు.
పూలే  ఆశయాల సాధన కోసం సమిష్టిగా కృషి చేయాలని అన్నారు.. మహాత్మునిగా పేరుగాంచిన పూలే జీవిత చరిత్రను దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో పాఠ్య పుస్తకాల్లో చేర్చాలని డిమాండ్ చేశారు.
జిల్లా కేంద్రంలో మరియు హైదరాబాదులోని ట్యాంక్ బండ్ పైన జ్యోతిబా పూలే మరియు సావిత్రిబా పూలే కాంస్య విగ్రహాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
జ్యోతిరావు పూలే కు కేంద్ర ప్రభుత్వం భారతరత్న అవార్డు తో సమచిత గౌరవం ఇవ్వాలని డిమాండ్ చేసినారు.
ఈ కార్యక్రమంలో సింగరేణి  విశ్రాంత కార్మిక సంఘం అధ్యక్షుడు, వాకర్ సభ్యుడు గజెల్లి వెంకటయ్య,  సామాజిక ఉద్యమకారుడు రంగు రాజేశం, రాష్ట్రపతి అవార్డు గ్రహీత గుండేటి యోగేశ్వర్,,వాకర్ సభ్యులు కర్రే లచ్చన్న, రాదేశ్యామ్, బూర్ల జ్ఞాని, తిరుపతి, అంజన్ రావు,సుధీర్,రాజేశం గౌడ్, రాజమల్లు, మహేందర్ రావు, రాంరెడ్డి, నటేశ్వర్, మోహన్,కమలాకర్ రావు తదితరులు పాల్గొన్నారు.