నెన్నెల, మే 1, (జనంసాక్షి )ఈనెల 5న మంచిర్యాల జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నెన్నెల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయాలని నెన్నెల తహసీల్దార్ భూమేశ్వర్ కోరారు. మండలంలోని యువత, స్వయం సహాయక సంఘాలు, స్వచ్చంద సంస్థలు, ప్రజా సంఘాలు, రైతు సంఘాలు, ప్రజాప్రతినిధులు స్వచ్ఛందంగా హాజరై విజయవంతం చేయాలన్నారు. ఇట్టి కార్యక్రమం మండల కేంద్రంలోని రైతువేదిక వద్ద నిర్వహించబడుతుందని, దాతలు తమ వివరాలు గిర్దావర్ గణేష్ (9441536969) అందజేయాలన్నారు.




