గద్వాల నడిగడ్డ, మే 12 (జనం సాక్షి);వృత్తిరీత్యా మేస్త్రి పని, చేస్తేనే పూట గడుస్తుంది పని మానేస్తే పస్తుతులుండాల్సి వస్తుంది అలాంటి వ్యక్తికి అకస్మాత్తుగా రక్త కణాల లోపం వల్ల రెండు కాళ్లును అ రోగం కబలించుకుంది. రెండు కాళ్లు చచ్చు పడడంతో దిక్కులెని స్థితిలో సోషల్ రెస్పాన్సిబిలిటీ టీం ను ఆశ్రమించారు. స్పందించిన సోషల్ రెస్పాన్సిబిలిటీ టీం శుక్రవారం ఆ వ్యక్తిని ఆదుకుంది. జోగులాంబ గద్వాల జిల్లా పరిధిలోని చెనుగోనిపల్లె గ్రామానికి చెందిన మోదిన్ (40) అనే వ్యక్తికి రక్త కణాల లోపం వల్ల రెండు కాళ్లు చచ్చు పడడంతో ఒకపక్క తన ఆసుపత్రి ఖర్చులు తడిచి మోపడవుతుంటే, మరోపక్క మూలిగే నక్కపై తాటి పండు పడ్డట్టు తన కుటుంబ పోషణ భారమై దిక్కులేని స్థితిలో ఉన్న వ్యక్తి సోషల్ రెస్పాన్సిబిలిటీ టీం ను ఆశ్రయించగా స్పందించిన సభ్యులు అతనిని, అతని కుటుంబ సభ్యులను పరామర్శించి ఆ కుటుంబానికి 32 వేల రూపాయలు నగదును అందజేసినట్లు టీం సభ్యులు తెలిపారు.ఈ కార్యక్రమంలో
సంజీవ్,వెంకట్ రాముడు, బెంజమిన్,నాగరాజు,మహేష్, పరమేష్, రాముడు, దేవన్న, సంధ్య అశోక్ తదితరులు పాల్గొన్నారు.




