Tuesday, 3 November 2026

రఘువీర్‌రావు మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం

cm condolence to raguveer rao

హైదరాబాద్: ఇవాళ సైదాబాద్‌లోని నివాసంలో తుదిశ్వాస విడిచిన ప్రముఖ పాత్రికేయులు సంతపురి రఘువీర్‌రావు మృతి పట్ల సీఎం కేసీఆర్ తీవ్రదిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ మేరకు రఘువీర్‌రావు కుటుంబసభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా రఘువీర్‌రావు సేవలను ముఖ్యమంత్రి కేసీఆర్ గుర్తు చేశారు. మెదక్ జిల్లాకు చెందిన1969 తెలంగాణ ఉద్యమనేత, ప్రముఖ పాత్రికేయులు అయిన రఘవీర్‌రావు తెలంగాణ ఉద్యమాన్ని ప్రాంభించిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు.
టీఆర్‌ఎస్ ఆవిర్భావ సమయంలో రఘువీర్‌రావు అండగా నిలవడం మరువలేనిదన్నారు. ఆయన ఉద్యమకారుడిగానే కాకుండా పాత్రికేయులుగా సేవలందించారని అన్నారు. రఘువీర్‌రావు అసెంబ్లీలో ట్రాన్స్‌లేటర్‌గా పనిచేశారని తెలిపారు. రఘువీర్‌రావు అనారోగ్యంతో ఉన్నప్పటికీ స్వయంగా సచివాలయానికి వచ్చి తనను ఆశీర్వదించిన సందర్భాన్ని సీఎం గుర్తు చేసుకున్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *