Tuesday, 3 November 2026

టీ ఉద్యోగులకు 43 శాతం ఫిట్ మెంట్

Latest News

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులకు తీపి కబురు అందించింది. రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత తొలిసారిగా పీఆర్సీని ప్రకటించింది. ప్రభుత్వోద్యోగులకు 43 శాతం ఫిట్‌మెంట్ ప్రకటించింది. ఈమేరకు ఇవాళ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రకటించారు. ప్రకటించిన ఫిట్‌మెంట్ 2014 జూన్ 2 నుంచి అమలవుతుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం జూన్ 2న వచ్చినందున ఆ రోజు నుంచి అమలు చేయాలని నిర్ణయించామన్నారు. ఇందుకు సంబంధించి ఉత్వర్వులు రేపు జారీ చేస్తామన్నారు. పీఆర్సీ సిఫార్సు చేసిన దానికంటే ఎక్కువగా జీతాలు పెంచామని తెలిపారు. పెరిగిన జీతాలు మార్చి నుంచి అమలులోకి వస్తాయని పేర్కొన్నారు. బకాయిలను జీపీఎఫ్‌లో జమచేస్తామని తెలిపారు.

జీతాల పెంపువల్ల ప్రభుత్వ ఖజానాపై ఏడాదికి రూ.6500 కోట్ల అదనపు భారం పడుతుందని చెప్పారు. ఈ అదనపు భారాన్ని భరించే శక్తి ప్రభుత్వానికి ఉందని వెల్లడించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగుల పాత్ర మరవలేనిదని శ్లాఘించారు. రాష్ట్ర సాధనలో ఉద్యోగులు అగ్రభాగాన నిలిచారని పొగిడారు. కేసులు పెట్టినా భయపడకుండా సకల జనుల సమ్మెలో పాల్గొన్నారని గుర్తు చేశారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *