Thursday, 5 November 2026

రమణదీక్షితుల వ్యాఖ్యలపై స్పందించాలి

తిరుమల,మే16(జ‌నం సాక్షి): శ్రీవారి ఆలయ ప్రధానార్చకుడు రమణ దీక్షితులు చేసిన ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని సీపీఎం నేత కందారపు మురళి డిమాండ్‌ చేశారు. రమణ దీక్షితులు వెనుక వున్న అదృశ్య శక్తులను ప్రభుత్వం బయటపెట్టాలన్నారు. రమణ దీక్షితులు ఆరోపణలతో శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం, టీటీడీలకు ఫిర్యాదు చెయ్యకుండా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తామనడం అనుమానాలకు తావిస్తోందని కందారపు మురళి అన్నారు.