రమేశ్ కుమార్ ను అభినందించిన కేంద్రమంత్రి.

తాండూరు జూన్ 14 (జనం సాక్షి) కేంద్రమంత్రి  కపిల్ మోరేశ్వర్ పాటిల్, పంచాయతీరాజ్ మంత్రిని జిల్లా ప్రధానకార్యదర్శి రమేశ్ కుమార్  మర్యాదపూర్వకంగా మంగళవారం
 ఢిల్లీ లోని నార్త్ ఎవెన్యూ లో గల వారి నివాసంలో   కలిశారు.ఈ సందర్భంగా మంత్రి తాండూరు రాజకీయాలు గురించి చర్చించారు. రమేశ్ కుమార్ చేస్తున్న పార్టీ కార్యక్రమాల పట్ల శభాష్ రమేశ్ అంటూ అభినందించారు.రాబోవు రోజుల్లో తెలంగాణాలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని, అన్ని రకాలుగా తన సహకారం ఉంటుందని, తాండూరులో భారతీయ జనతా పార్టీని మరింత బలోపేతం చేస్తూ బీజేపీ జెండా ఎగురేయాలన్నారు.