రమ్య హత్యకు నిరసనలు

విశాఖపట్నం,అగస్టు16(జనంసాక్షి): బీటెక్‌ విద్యార్ధిని రమ్య హత్యను నిరసిస్తూ టీఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్‌ గోపాల్‌ ఆధ్వర్యంలో వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. ఎల్‌ఐసీ బిల్డింగ్‌ అంబేద్కర్‌ విగ్రహం వద్ద మోకాళ్లపై నిలబడి నిరసనకు దిగారు. ఈ సందర్భంగా ప్రణవ్‌ గోపాల్‌ మాట్లాడుతూ బాధితురాలి కుటుంబానికి ప్రభుత్వం కోటి రూపాయలు పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కుటుంబంలో ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలన్నారు. ఈ ఘటనకు నైతిక బాధ్యత వహించి సీఎం, హోమ్‌ మినిస్టర్‌ తమ పదవులకు రాజీనామా చేయాలని ప్రణవ్‌ గోపాల్‌ డిమాండ్‌ చేశారు.