Monday, 2 November 2026

రవిది ఆత్మహత్యే

సంచలనం సృష్టించిన ఐఏఎస్ అధికారి డీకే రవి మృతి ఆత్మహత్యేనని చెప్తున్న పోలీసులు.. అందుకు సంబంధించిన ఓ ఆధారాన్ని బయటపెట్టారు. రవి తన సహోద్యోగి అయిన మహిళా ఐఏఎస్ అధికారిని ప్రేమించాడని, చనిపోవడానికి ముందు ఆమెకు వాట్సప్ ద్వారా మెసేజ్ లు పంపించాడని తెలిపారు. ఆమె, ఆమె భర్త కలిసి రవికి పలుమార్లు కౌన్సెలింగ్ కూడా ఇచ్చారని పేర్కొన్నారు. కాగా పోలీసులు వెల్లడించిన వాట్సప్ మెసేజ్ లలో రవి ఈ నెల 15న “నువ్వు లేకుండా బతకలేను. అందుకే కఠినమైన నిర్ణయం తీసుకోబోతున్నాను, నా ప్రేమను బయటపెట్టొద్దు. నాకు ఫోన్ చెయ్యొద్దు. మరో జన్మంటూ ఉంటే అప్పుడు కలుసుకుందాం” అని పలు మెసేజ్ లు చేశాడు. ఇదేం పిచ్చితనం అంటూ ఆమె రిప్లై కూడా ఇచ్చింది. ఈ నెల 16న రవి సుదీర్ఘమైన మెసేజ్ పంపించాడు. అందులో “ఇదే నా చివరి మెసేజ్. నా చావు గురించి తెలిశాకనైనా వచ్చి నన్ను చూడు. ఒక్కసారి నన్ను తాకు” అని రాశాడు. తాను పేద కుటుంబంలో జన్మించిన విషయం, సిన్సియారిటీ వంటి విషయాలనూ పేర్కొన్నాడు. దీన్నిబట్టి అతనిది ఆత్మహత్యేనని పోలీసులు పేర్కొంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *