రవి కుటుంబంతో విభేదాలు లేవు

హైదరాబాద్‌: కొంతకాలంగా మౌనంగా ఉన్న పరిటాల రవి అనుచరుడు చమన్‌ తన భవిష్యత్‌ ప్రణళిక గురించి నోరువిప్పారు. పరిటాల రవి కుటుంబంతో తనకెలాంటి విభేదాలు లేవని ఒక శ్రేయేభిలాషిగా వారి కుటుంబాన్ని రాజకీయాలకు దూరంగా ఉండమని చెప్పానని చమన్‌ అన్నారు. రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ప్రస్తుతం లేకున్నా భవిష్యత్‌లో అనుచరులు సన్నిహుతులు సూచించిన రాజకీయపార్టీలో చేరాలనుకుంటున్నట్లు వెల్లడించారు. ఇప్పుడు తనకెవరూ ప్రత్యర్థులు లేరని. త్వరలోనే అనంతపురం కెళ్లనున్నట్లు హైదరాబాద్‌లో మీడియాతో అన్నారు.