మత్స్యకారులకు చేయూతనివ్వని ఉచిత చేప పిల్లల పథకం ఆరు సంవత్సరాలుగా మత్స్య శాఖకు లీజు కట్టని సొసైటీ – అయినా ఎలక్షన్ నిర్వహిస్తున్న జిల్లా మత్స్య శాఖజనరల్ ఎలక్షన్ ను తలపిస్తున్న తిరుమలగిరి మత్స్య శాఖ ఎలక్షన్తిరుమలగిరి (సాగర్) ఫిబ్రవరి 06, (జనంసాక్షి):తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారులకు అందిస్తున్న ఉచిత చేప పిల్లల పథకం మండల కేంద్రంలోని మత్స్యకారులకు చేయూతనివ్వడం లేదని పలువురు మత్స్యకారులు పలు ఆరోపణలు చేస్తున్నారు.ఆరు సంవత్సరాలుగా నల్లగొండ జిల్లా మత్స్య శాఖకు తిరుమలగిరి చెరువు మత్స్యకారులు లీజ్ కట్టకుండా పెండింగ్లో ఉంచారు.ప్రతి సంవత్సరం ఉచిత చేప పిల్లలు పోసిన అనంతరం మే,జూన్ నెలలో మత్స్య శాఖకు లీజ్ కట్టి చేపలు పట్టుకునేవారు..కాగా గత ఆరు సంవత్సరాలుగా తిరుమలగిరి పెద్ద చెరువులో అవినీతి పేరుకుపోయింది.అయినా అధికారులు లీజు పెండింగ్లో ఉన్నప్పటికీ నోటీసులు మాత్రమే జారీ చేసి ఆ చెరువులో చేప పిల్లలు వదులుతూనే ఉన్నారు.గత సంవత్సరం డిసెంబర్ లో ప్రభుత్వం అందిస్తున్న ఉచిత చేప పిల్లలను అధికారులు కొందరి మత్స్యకారులకు మాత్రమే సమాచారం ఇచ్చి.. మిగతా వారికి సమాచారం అందిచకుండా చేపలను చెరువులో వదిలారని వారు ఆరోపణలు వినిపిస్తున్నాయి.ఆరు సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న లీజుపై ఎటువంటి క్లారిటీ ఇవ్వకుండానే ఎలక్షన్ నోటిఫికేషన్ జారీ చేశారు.దీంతో ఆశావాహులు అధిక మొత్తంలో నామినేషన్లు వేశారు – పోటా పోటీగా నామినేషన్లు : నల్లగొండ జిల్లా మత్స్యశాఖ తిరుమలగిరి పెద్ద చెరువుకు ఎలక్షన్ నోటిఫికేషన్ జారీ చేయడంతో అభ్యర్థులు పోటాపోటీగా నామినేషన్లు వేశారు.ఫిబ్రవరి 1,2,3 వ తేదీలలో నామినేషన్లు పూర్తి కాగా 23 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు.. నాలుగో తేదీన స్క్రూట్ ని నిర్వహించారు.సోమవారం అభ్యర్థుల విత్ డ్రా అనంతరం పోటీలో ఉన్న 19 మంది అభ్యర్థులకు గుర్తులను కేటాయించారు.దీంతో ఈ నెల 10న గ్రామ పంచాయతీలో ఎలక్షన్ నిర్వహిస్తున్నట్లు ఎలక్షన్ ఆఫీసర్ షణ్ముఖ చారి తెలిపారు.




