రాజకీయాల్లో పడిలేచిన కెరటం


ఎపిలో పవన్‌ కళ్యాణ్‌ భారీ హిట్టు
అమరావతి,జూన్‌4(జనంసాక్షి):మెగాస్టార్‌ చిరంజీవి తమ్ముడిగా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో చలన చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టిన పవన్‌ కళ్యాణ్‌.. ఇంతింతై వటుడిరతై అన్న చందంగా ఎదిగాడు. హిట్‌ ప్లాప్‌ లతో సంబంధం లేకుండా పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ అభిమానులను అలరిస్తూనే ఉన్నాడు. అందరి హీరోలకు అభిమానులుంటారు. అన్న మెగా స్టార్‌ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం
పార్టీలో యువనేతగా రాజకీయంలో అడుగు పెట్టాడు. రాజకీయంగా అన్నతో విబేధించి ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన పవన్‌ కళ్యాణ్‌ అనూహ్యంగా జనసేన పార్టీని స్థాపించాడు. అయితే 2014 లో నవ్యాంధప్రదేశ్‌ లో జరిగిన ఎన్నికల్లో పోటీ చేయకుండా ఎన్డీయే కూటమికి బేషరత్తుగా తన మద్దతు ప్రకటించాడు. ప్రభుత్వం పని తీరు నచ్చక పొతే నేను ప్రశ్నిస్తా అని అన్న జనసేనాని.. అప్పటి నుంచి అధికారంలో ఉన్న పార్టీ ఏదైనా తనకు అన్యాయం అన్న విషయంపై, ప్రభుత్వంలో జరిగే అవకతవకలపై తన గళం వినిపిస్తూనే ఉన్నాడు. 2019లో జరిగిన ఎన్నికల్లో ఒంటరిగా పోటీకి వెళ్ళిన పవన్‌ కళ్యాణ్‌ ఘోర పరాజయాన్ని పొందాడు. తాను పోటీ చేసిన విశాఖ, భీమవరం నుంచి మాత్రమే కాదు.. ఒక్క రాజోలు నియోజక వర్గం ఎమ్మెల్యే రాపాక మినహా మిగిలిన జనసేన అభ్యర్ధులు కూడా ఓటమి పాలయ్యారు. అప్పుడు సర్వత్రా విమర్శలను ఎదుర్కొన్నాడు. వైసిపీ ప్రభుత్వం, జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వం తీరుపై సునిసిత విమర్శలు చేస్తూ.. ప్రజలు కష్టాల్లో తానున్నాను అంటూ భరోసాగా నిలిచాడు. అన్నదాతలకు మాత్రమే కాదు చేనేత కార్మికులకు.. ఇలా బాధితులకు అండగా నిలిచాడు. తన సొంత డబ్బులకు బాధిత కుటుంబాలకు ఇచ్చి అండగా నిలిచాడు. అంతేకాదు.. ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతుండగా వైసిపీకి చెక్‌ పెª`టటె విధంగా రాజకీయ చతురతను చాటుకున్నాడు. చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్న సమయంలో పరామర్శకు వెళ్ళిన పవన్‌ హటాత్తుగా విూడియా ముందుకు వచ్చి ఎన్నికల్లో టిడిపీ, జనసేన కలిసి పోటీ చేస్తుంది అని ప్రకటించాడు. అంతేకాదు.. ఏపీ ప్రజల ప్రయోజనం కోసం తనని తానూ తగ్గించుకుని మరీ తక్కువ సీట్లతోనే పోటీకి వెళ్ళడమే కాదు.. బీజేపీని కూడా కూటమితో కలిసి నడిచేలా చేయడంలో పవన్‌ పాత్ర గురించి ఎంత చెప్పినా తక్కువే.. పిఠాపురం నుంచి బరిలోకి దిగిన పవన్‌ కళ్యాణ్‌ ను ఓడిరచడం కోసం అధికార వైసిపీ ప్రభుత్వం రాజకీయ ఉద్దండులను రంగంలోకి దింపింది. స్వయంగా సిఎం జగన్‌ .. వైసిపీ అభ్యర్ధి వంగా గీతను గెలిపిస్తే డిప్యూటీ సిఎం పదవిని ఇస్తానని ప్రకటించారు. అయినప్పటికీ పవన్‌ కళ్యాణ్‌ గెలుపు నల్లేరు విూద నడకలా సాగింది. పవన్‌ విూద అభిమానంతో మెగా హీరోలు మాత్రమే కాదు అనేక మంది మేము సైతం అంటూ మద్దతు తెలిపారు.