
ద డ్రమాటిక్ డికేట్లో ప్రణబ్ ముఖర్జీ
దిల్లీ డిసెంబర్,14 (జనంసాక్షి) : రాజకీయ నేతలే రాష్ట్రపతి పదవిని అదిరోహించాలని ఇతర ప్రముఖులెవరూ ఉండకూడదని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అభిప్రాయపడ్డారు. చట్టసభలను నడిపే సభాపతులు కూడా రాజకీయ రంగానికి చెందినవారైతేనే సున్నితమైన అంశాల్లో సమతూకంతో కూడిన నిర్ణయాన్ని వెలువరించగలరని ఆయన చెప్పారు. ‘ఇందిరాగాంధీ పాలన- నాటకీయ దశాబ్దం’ (ది డ్రమెటిక్ డెకేడ్- ది ఇందిరా గాంధీ ఇయర్స్) పేరుతో ఆయన రచించి, ఇటీవల విడుదల చేసిన పుస్తకంలో- రాజ్యాంగ బద్ధ పదవుల నిర్వహణ గురించి ప్రస్తావించారు. రాజకీయ నేపథ్యం లేకుండానే రాష్ట్రపతి పదవుల్ని నిర్వర్తించిన వారిలో సర్వేపల్లి రాధాకృష్ణన్, ఎ.పి.జె. అబ్దుల్‌కలాం ఉన్నారు. అదే విధంగా ఉప రాష్ట్రపతిగా బాధ్యతలు నిర్వర్తించిన రాజకీయేతరుల్లో రాధాకృష్ణన్, జి.ఎస్.పాథక్, జస్టిస్ ఎం.హిదయతుల్లా ఉన్నారు. రాష్ట్రపతి తన అభిప్రాయాలకు మద్దతుగా 1980 నాటి ఘటనల్ని ప్రస్తావించారు. ఆ ఏడాది కాంగ్రెస్ పార్టీ, ఇందిరాగాంధీ తిరిగి అధికారాన్ని దక్కించుకున్నా రాజ్యసభలో మాత్రం ఆధిక్యం లేదు. 1977లో అధికారంలోకి వచ్చిన జనతాపార్టీ- కొన్ని రాష్గాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలను కూలదోసింది. దీనికి ప్రతీకారం తీర్చుకోదలచిన కాంగ్రెస్ పార్టీ కొన్ని రాష్గాల శాసనసభలను రద్దు చేయడానికి సంకల్పించింది. ఆ తీర్మానం ఎగువసభలో ఓడిపోకుండా చూసుకోవాల్సి వచ్చింది. మొత్తానికి ప్రభుత్వ తీర్మానానికి వ్యతిరేకంగా సీపీఐ వృద్ధ నేత భూపేష్ గుప్తా పెట్టిన తీర్మానాన్ని కాంగ్రెస్ చీలికవర్గం మద్దతుతో వీగిపోయేలా చేశారు. 1977లో ఏం జరిగిందో 1980లోనూ అదే జరిగింది. అది తప్పు అయితే ఇదీ తప్పే. ఇతర పార్టీలకు సమ్మతమైనదిగా కనిపించిన విషయం… కాంగ్రెస్ (ఐ)కి తప్పుగా కనిపించింది. దానిని ఎవరూ ప్రశ్నించలేదు. తమకు లభించిన ప్రజాదరణతో 1977లో రాష్గాల శాసనసభల ఎన్నికల్లోనూ నెగ్గాలని జనతాపార్టీ భావించింది. 1980లో కాంగ్రెస్ కూడా అలాగే చేయదలచింది…’ అని ముఖర్జీ పేర్కొన్నారు. సిద్ధాంత ప్రకారం సభ నిర్వహణ వరకు రాజ్యసభ ా’య్రర్మన్కు అన్ని అధికారాలూ ఉన్నా ఆచరణలో అది సాధ్యం కాదన్నారు.
రాజకీయవేత్తలకే సమతూకం తెలుసు
‘చట్టసభ అంటే రాజకీయ వ్యవస్థే గానీ కేవలం చర్చలు జరిపే క్లబ్ కాదు. రాజకీయ శక్తుల మార్గనిర్దేశం మేరకు జాతికి సంబంధించిన చర్చలు చేపడుతుండాలి. శాసన కార్యకలాపాల్లో రాజ్యసభ సంతులన పాత్ర పోషించాలి. అది ద్వితీయ ఛాంబర్ కాదు. అదే సమయంలో ప్రజాతీర్పుతో అధికారంలోకి వచ్చిన పార్టీకి సంఖ్యాబలంతో అది అడ్డంకులు సృష్టించరాదు. సున్నితమైన సందర్భాలు తలెత్తినప్పుడు సమతూకం పాటిస్తూ తీర్పునివ్వడం రాజకీయనాయకులకే తెలుస్తుంది గానీ ఇతరత్రా ప్రముఖులకు కాదు. అందువల్ల ఇలాంటి పదవుల్ని వారే నిర్వర్తించాలి’ అని ప్రణబ్ తన పుస్తకంలో రాశారు.
పూర్తిగా అలా ఆశించలేం…
‘భారతదేశంలో సభాపతులు రాజకీయ పార్టీల మద్దతుతో ఎన్నికవుతారు. అందువల్ల సభాపతులు పూర్తిగా రాజకీయ మొగ్గు లేకుండా ఉండాలని ఎవరూ ఆశించకూడదు. వారు తటస్థంగా ఉండేందుకు ప్రయత్నించాల్సిందే. అయితే మరీ అర్థరహితమైన స్థాయి వరకు ఆ తటస్థతను ఆశించరాద’ని రాష్ట్రపతి పేర్కొన్నారు.




