హైదరాబాద్,(జనంసాక్షి): ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి జేఏసీ రాజకీయ పార్టీగా అవతరించనుంది. సెప్టెంబర్ 17న ఓయూలో ఓయూ జేఏసీ భారీ బహిరంగ సభను నిర్వహించనుంది. అదే వేదికపై పార్టీ పేరు, విధివిధానాలను ప్రకటించనున్నారు. స్థానిక ఎన్నికల్లో పోటీ చేయాలని ఓయూ జేఏసీ నిర్ణయించింది. మహబూబ్‌నగర్, వరంగల్, రంగారెడ్డి, నిజామాబాద్, నల్లగొండ జిల్లాల్లోని 10 గ్రామ పంచాయతీలకు ఓయూ జేఏసీ పోటీ చేయనుంది. ఈ పది స్థానాలకు ఓయూ జేఏసీ అభ్యర్థులను ప్రకటించింది.




