రాజధాని ఎక్స్‌ప్రెస్ డ్రైవర్ సస్పెన్షన్
కర్నూలు: ఆదోని రైల్వే స్టేషన్‌లో సిగ్నల్ పాటించకు రాజధాని ఎక్స్‌ప్రెస్ ముందుకు వెళ్లిన ఘటనపై రైల్వే అధికారులు విచారణ చేపట్టారు. పాస్ట్ డేంజర్ సిగ్నల్ ఉన్నప్పటికీ ఎక్స్‌ప్రెస్‌ను ముందుకు తీసుకువెళ్లిన డ్రైవర్ పై సస్పెన్షన్ వేటు వేసిననట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్‌వో సాంబశివరావు తెలియజేశారు. డ్రైవర్ నిర్లక్ష్యమే ఘటనకు కారణంగా ప్రాథమిక విచారణలో తేలిందని ఆయన చెప్పారు.