న్యూఢిల్లీ,జనవరి14జనంసాక్షి: చల్లటిచలిలోనూ ఢిల్లీలో ఎన్నికల వేడి రాజుకుంటోంది. ఇక్కడ ఎన్నికల ప్రచారంలో అంశాలే లేకుండా కాంగ్రెస్, ఆమ్ ఆద్మీపార్టీలు ముందుకు వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది. ఏడాదిలోగా మరోమారు ఎన్నికలు రావడానికి ప్రధానంగా ఈ రెండు పార్టీలే కారణమని చెప్పుకోవాలి. వీరివల్ల ఖజానాపై అదనపు భారం కూడా పడినట్లే. వీరిపొత్తు వికటించిన కారణంగా కేజ్రీవాల్ కేవలం 43 రోజులకే చాపచుట్టేశారు. పేరుకే రాజధానిగా ఉన్న ఢిల్లీలో అనేక సమస్యలు ఉన్నాయి. వీటిని పరిస్కరించే సత్తా చూపాల్సిన పార్టీ లేదా నాయకుడు కావాలి. అందుకే ప్రధాని మోడీ ఎన్నికల శంఖారావంలో ఢిల్లీలో ప్రధానంగా ఉన్న విద్యుత్ సమస్యను ప్రస్తావించారు. ఇక్కడ జనరేటర్ల మోత లేకుండా చేస్తానన్నారు. దీనికి ముందుగానే ప్రధాని ఎల్‌ఇడి బల్బుల వినియోగాన్ని ప్రారంభించారు. విద్యుత్ పొదుపు కూడా ఉత్పత్తికి సమానమని వివరించారు. కోటీ 30లక్షలమంది ఓటర్లు, 70 నియోజక వర్గాలు గల దిల్లీ అసెంబ్లీకి ఒకే విడతగా వచ్చేనెల ఏడున ఎన్నిక నిర్వహించి పదోతేదీన ఫలితాల వెల్లడికి ఇసి రంగం సిద్ధం చేసింది. ఎన్నికల నగారా మోఓగడంతో ప్రధాని మోడీని లక్ష్యంగా చేసుకుని కేజ్రీవాల్ ప్రచార రంగంలోకి దిగారు. తన 43 రోజుల పాలనలో తీసుకున్న నిర్ణయాలే ఆయనకు ప్రచారాస్త్రాలుగా ఉన్నాయి. అయితే ఆయనకు ప్రచారంలో చేదు అనుభవాలు తప్పడం లేదు. ఆమ్ ఆద్మీపార్టీ అధినేత అరవింద్ కేజీవ్రాల్‌పై గుర్తుతెలియని వ్యక్తి కోడిగుడ్లు, రాళ్లు విసిరాడు. వాయువ్య దిల్లీలోని సుల్తాన్‌పూర్ మజ్రా నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ సంఘటనలో కేజీవ్రాల్‌కు ఎటువంటి గాయాలూ కాలేదు..కేజీవ్రాల్ తన మూడో జనసభను మంగళవారం సుల్తాన్‌పూర్ మజ్రాలోని జిలేబీ ల్మక్‌లో ఏర్పాటు చేశారు. కేజీవ్రాల్ ప్రసంగిస్తుండగా ఓ వ్యక్తి కోడిగుడ్లు, రాళ్లు విసిరి అక్కడినుంచి పారిపోయాడు. అయితే అవి సభావేదికకు దగ్గరగా పడటంతో ప్రమాదం తప్పింది. కేజీవ్రాల్‌పై సుల్తాన్‌పూర్ మజ్రాలో దాడికి ప్రయత్నించడం ఇది రెండోసారి. ఆయనపై ప్రజలకున్న వ్యతిరేకతకు ఇది నిదర్శనంగా చెప్పుకోవాలి. అధికారం చేపట్టిన ఏడు వారాలకే అర్దాంతరంగా నిష్కమ్రించి ఓటర్ల నమ్మకాన్ని వమ్ము చేసిన కేజీవ్రాల్- ఆ తప్పు మళ్ళీ చెయ్యబోనని చెబుతున్నారు. అప్పట్లో అభ్యర్థుల ఎంపికనుంచి విరాళాల సేకరణ దాకా ఆప్ అగ్రనేతలు పారదర్శక విధానాలతో ఆకట్టుకొన్నారు. మద్దతివ్వదలచిన పార్టీలకే షరతులు పెట్టి, ప్రభుత్వ ఏర్పాటుపై ప్రజామోదం రాబట్టి వినూత్న పంథాలో సాగినా- పాలన విషయంలో ఆందోళనల పంథా వీడనే లేదు. దేశ రాజధాని పాలనాధికారాన్ని చేజిక్కించుకునేందుకు భాజపా, ఆప్, కాంగ్రెస్ పార్టీలు మూడింటికీ ప్రతిష్ఠాత్మకం కావడంతో ధనబల శక్తుల విజృంభణను అడ్డుకునే దిశగా ఇసి కసరత్తు చేస్తోంది. దేశ రాజకీయాల పరివర్తనోద్యమం అంటూ పుట్టుకొచ్చిన ఆమ్‌ఆద్మీ పార్టీ (ఆప్) పట్టుమని పదకొండు మాసాల్లోనే ప్రజల్లోకి చొచ్చుకుపోయి క్రితంసారి సంప్రదాయ రాజకీయపక్షాల దిమ్మ తిరిగిపోయే ఫలితాల్ని రాబట్టింది. 29.6శాతం ఓట్లు 28 సీట్లు సాధించింది. 11చోట్ల డిపాజిట్లు కోల్పోయిన కాంగ్రెస్ 24.6శాతం ఓట్లతో నికరంగా దక్కించుకొన్నవి ఎనిమిది సీట్లనే దక్కించుకుంది. మోదీ ప్రచార సారథ్యంలో 34శాతం ఓట్లను తెచ్చుకొన్న భాజపా సాధారణ మెజారిటీకి నాలుగు సీట్లు తక్కువగా అంటే 30 సీట్లతో సరిపుచ్చుకుంది. ఎవరికీ మెజార్టీ రాని నేపథ్యంలో సుప్రీం ఆదేశాలతో మరోమారు ఎన్నికలకు తెరలేచింద.ఇ దిల్లీ రూపురేఖలు మార్చింది మేమే అని కాంగ్రెస్ చెప్పుకొంటున్నా రేపటి పోరు భాజపా, ఆప్‌ల మధ్యనే అన్నద ఇస్పస్టమయ్యింది. మొన్నటి లోక్‌సభ ఎన్నికల్లో దిల్లీలోని మొత్తం ఏడు సీట్లనూ లక్షకు పైగా మెజారిటీతో బిజెపి కైవసం చేసుకుంది. పోలీసు, శాంతిభద్రతలన్న అంశాలు దిల్లీ ప్రభుత్వ అజమాయిషీలో ఉండవని తెలిసీ- కొందరు పోలీసు అధికారులపై చర్యకోసం ముఖ్యమంత్రిగా కేజీవ్రాల్ ధర్నాలకు దిగడం ఆయనపై అరాచకవాది అన్న ముద్రవేసింది. ప్రస్తుతం దిల్లీ అభివృద్ధి ప్రాధికార సంస్థ, మున్సిపల్ కార్పొరేషన్ వంటివి కూడా కేంద్రసర్కారు పరిధిలో కొనసాగుతున్న విషయం తెలిసీ పెత్తనం కోసం ప్రయత్నించారు. జనసంఖ్యలో టోక్యో తరవాత రెండోస్థానంలో ఉన్న దిల్లీ- 95 ప్రపంచ నగరాల స్థితిగతుల నివేదికలో 58వ స్థానంలో నిలిచింది. శాంతిభద్రతలు, నీటిసరఫరా, విద్యుత్, రవాణా, అక్రమ కాలనీలు, ట్రాఫిక్, అవినీతి… ఇలా చెప్పుకొంటూ పోతే లెక్కలేనన్ని సమస్యల ఊబిలో దిల్లీ ఉక్కిరిబిక్కిరవుతోంది. అన్ని విధాలుగా ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలకు ప్రధాన పార్టీలన్నీ హావిూలిస్తున్నాయి. ఎవరికెవరు జవాబుదారీయో తెలియని వాతావరణంలో ఎక్కడికక్కడ సమస్యలు తిష్ఠ వేస్తున్నాయి. ప్రధానంగా ఇక్కడ శాంతిభద్రతలు పూర్తిగా నీరసించాయి. దీనికితోడు అత్యాచార ఘటనలు లెక్కకుమిక్కిలిగా ఉన్నాయి. వీటన్నిటిని ఉఎక్కుపాదంతో అణచివేయాల్సి ఉంది. ఇందుకు తగిన విధంగా ప్రజలు బలమైన నాయకులను ఎన్నకుని విజ్ఞత పాటిస్తారా అన్నది చూడాలి.




