
ఇద్దరి మృతి.. చికిత్స పొందుతున్న 12 మంది
హైదరాబాద్,జనవరి14(జనంసాక్షి): నగరంలో స్వైన్ ఫ్ల్యూ రెక్కలు విచ్చుకుంటుంది. రోజు రోజుకు కేసులు పెరుగుతున్నాయి. దీని నివారణ కోసం రోగులు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. ఇప్పటి వరకు 74 స్వైన్‌ఫ్లొ కేసులు నమోదైనట్లు అధికారులు గుర్తించారు. గాంధీ ఆసుపత్రిలో 10మంది స్వైన్ ఫ్లొ బాధితులు చికిత్స పొందుతుండగా, ప్రైవేటు ఆసుపత్రిలో మరో 10 మంది చికిత్స పొందుతున్నారు. దీంతో రాష్ట్ర రాజధాని నగరం హైదరాబాద్‌లో స్వైన్‌ఫ్లూ విజృంభిస్తుంది. చలి తీవ్రతకు తోడు ఈ కేసుఉల నమోదు ఆందోళన కలిగిస్తోంది. రెండు రోజుల్లో 20 కేసులు నమోదయ్యాయి. బాధితులు ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో చేరి చికిత్స పొందుతున్నారు. స్వైన్‌ఫ్లూపై వైద్యులు స్పందిస్తూ.. స్వైన్‌ఫ్లూపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అయినప్పటికీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. చలితీవ్రతతో స్వైన్‌ఫ్లూ మరింత విస్తరించే అవకాశం. నగరవాసులు వ్యక్తిగత శుభ్రతతో పాటు భయటకు వెళ్లేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.




