రాజపేటలో శ్రీకాంతచారి వర్ధంతి
రాజాపేట, డిసెంబర్3 ( జనం సాక్షి): తెలంగాణ అమరుడు శ్రీకాంతచారి వర్ధంతి సందర్బంగా రాజాపేట మండల BJP శాఖ ఆధ్వర్యంలో శనివారం గాంధీ చౌరస్తాలో చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.కార్యక్రమంలో భారతీయజనతా పార్టీ యాదాద్రిభువనగిరి జిల్లా ఉపాధ్యక్షులు ఉట్కూరి అశోక్ గౌడ్ మాట్లాడుతూ 1200 వందల మంది అమరవీరుల త్యాగాలు చేస్తే ఏర్పడిన తెలంగాణ ను కెసిఆర్ అమరుల త్యాగలానే పునదులుగా ఏర్పరచుకొని రాజబోగాలు అనుభవిస్తున్నారు అని విమర్శించారు.కనీసం అమరవీరుల కుటుంబాలను పట్టించుకున్న దాకలాలు లేవు అని విమర్శించారు. శ్రీకాంత చారి జయంతి, వర్ధంతి కార్యక్రమాలు అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేసారు.




