వైకల్యం మనిషికే కానీ మనసుకు కాదు
జహీరాబాద్ డిసెంబర్ 3(జనంసాక్షి )వైకల్యం మనిషికే కానీ మనసుకు కాదని టి వీవీ జిల్లా అధ్యక్షులు రాయికోటి నర్సిములు అన్నారు, అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పుర్కరించుకొని శనివారం రోజున జిల్లా మహిళలు పిల్లలు దివ్యాంగులు మరియు వయో వృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జహీరాబాద్ నుండి భారీగా తరలివెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏదైనా సాధించగలమనే సంకల్పం ఉంటే ఎటువంటి వైకల్యమైనా సంకల్పం ముందు దాసోహమేనని అన్నారు.వైకల్యంతో మానసికంగా కృంగిపోతున్నవారు ఎంతో మంది ఉన్నారని, అయితే మనో సంకల్పం ముందు వైకల్యం అవరోధం కాదని, మనో ధైర్యమే విజయానికి అసలైన సాధనాలని అన్నారు,ఈ కార్యక్రమంలో టి వీవీ జిల్లా ఉపాధ్యక్షుడు మన్నే పోచయ్య వివిధ నియోజకవర్గ దివ్యంగులు తదితరులు పాల్గొన్నారు.
వైకల్యం మనిషికే కానీ మనసుకు కాదు




