వరంగల్: మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య బర్తరఫ్‌కు నిరసనగా రాజయ్య వర్గీయులు భారీ ర్యాలీ చేపట్టారు. జిల్లాలోని ఏకశిలా పార్క్ నుంచి కలెక్టరేట్ వరకు నిర్వహించిన ర్యాలీలో ఎమ్మార్పీఎస్, ఎంఎస్‌పి నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఈ ర్యాలీలో నల్లజెండాలతో నిరసన తెలిపారు.




