జైపూర్: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా ముందుండి పార్టీని విజయం నడిపించే బాధ్యత వసుధంర రాజెకి అప్పగించింది. భాజపా అధినాయకత్వం. భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ ఈ విషయం ప్రకటిస్తూ ముఖ్యమంత్రి అభ్యర్థిగా , పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిగా వసుంధర రాజె వ్యవహరిస్తారని పేర్కొన్నారు. పార్టీ నిర్ణయాన్ని శిరసావహిస్తానని, పార్టీ విజయం కోసం అందరం కలిసి కృషిచేస్తామని ఈ సందర్భంగా వసుంధర తెలియజేశారు.




