హైదరాబాద్: కేకే నివాసంలో తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ ఎంపీలు భేటీ అయ్యారు. ఈ భేటీకి వివేక్, రాజయ్య, కోమటిరెడ్డి తదితరులు హాజరయ్యారు. తెలంగాణ అంశంపై చిత్తశుద్ధితోనే రాజీనామాలు చేశామని ఎంపీ రాజయ్య తెలిపారు. ఏడుగురి రాజీనామా లేఖలను సోనియా కార్యాలయంలో అందజేశామని రాజీనామాలు ఆమోదించేవరకు పార్టీలోనే ఉంటామని ఎంపీ రాజయ్య చెప్పారు. రాజీనామాలకు కట్టుబడి ఉన్నామని, తమ మధ్య విభేదాలు లేవని కేకే తెలిపారు.




