హైదరాబాద్: తెలంగాణ అంశంపై కాంగ్రెస్ అధిష్ఠానం వైఖరికి నిరసనగా లోక్‌సభ సభ్యత్వాలకు రాజీనామాపై ఇప్పటికే ఓ నిర్ణయం తీసుకున్నట్లు తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు తెలిపారు. తమ నిర్ణయాన్ని మధ్యాహ్నం ప్రకటిస్తామని ఎంపీలు వివేక్ రాజయ్య చెప్పారు. కాంగ్రెస్ ఎంపీలు ఈ ఉదయం కేకే నివాసంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఎంపీలు వివేక్, రాజయ్య విలేకరులతో మాట్లాడుతూ మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా మాతో కలిసివస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు. నిన్న జరిగిన సమరదీక్షలో తెరాస అధినేత కేసీఆర్ ప్రధానిని చెప్రాసీ అనడం తగదని అన్నారు. తెలంగాణపై మరిన్ని సంప్రదింపులు అవసరమని కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వం వెల్లడించాని నేపధ్యంలో పార్టీకి, పదవికి రాజీనామా చేస్తున్నామని మరో ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలియజేశారు.




