Wednesday, 4 November 2026

రాజీవ్ గాంధీ యూత్ ఆన్లైన్ క్విజ్ కాంపిటీషన్ లో యూవత అధిక సంఖ్యలో పాల్గొనాలి మాజీ ఎమ్మెల్యే ఏఐసిసి కార్యదర్శి డాక్టర్ ఎస్ ఏ సంపత్ కుమార్

 

 

 

 

 

అలంపూర్ మే22(జనంసాక్షి)తెలంగాణ అవతరణ దినోత్సవం జూన్ 2వ తేదీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ యూత్ అన్ లైన్ క్విజ్ పోటీలు నిర్వహించడం జరుగుతుంది నియోజకవర్గం లో అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలనీ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ అన్నారు.సోమవారం శాంతి నగర్ లో క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఏర్పాటు చేసి కరపత్రం విడుదల చేశారు.ఈసందర్బంగా సంపత్ కుమార్ మాట్లాడుతూ అలంపూర్ నియోజకవర్గం నుండి యువత అధిక సంఖ్యలో పాల్గొని సంచలనాత్మక హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ స్ఫూర్తిగా తెలంగాణ యువ శక్తిని మేల్కొలేపే దిశగా పాల్గొని విజయవంతం చేయలాని అయన అన్నారు.క్విజ్ పోటీ లలో గెలుపొందిన యువతకు ప్రోత్సాహక బహుమతులు ఫస్ట్ ప్రైజ్ లాప్టాప్ సెకండ్ ప్రైజ్ స్మార్ట్ ఫోన్ థర్డ్ ప్రైజ్ టాబ్లెట్ ఇవ్వబడును అన్నారు.
ప్రతి నియోజకవర్గంలో గెలుపొందిన మహిళ టాపర్లకు ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవ్వబడును నియోజకవర్గానికి 40 ప్రోత్సాహక బహుమతులు ఇవ్వడం జరుగుతుంది అన్నారు.
ఆన్లైన్ పరీక్షకు పాల్గొనే యువత మొదటగా 7661899899 నంబర్ కు మిస్డ్ కాల్ ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకొనవాలి అన్నారు.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి మహిళా అధ్యక్షురాలు నాగ శిరోమణి, కిసాన్ అధ్యక్షుడు నాగరాజు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎర్రవల్లి రవి. ఇటిక్యాల మండల అధ్యక్షుడు రుక్మంత రెడ్డి, మాజీ ఎంపిటిసి చిన్నిబాబు, యోగి రెడ్డి,వెంకటన్న, వెంకటేష్, దేవేంద్ర, పచ్చర్లకుమార్ తదితరులు పాల్గొన్నారు.