Thursday, 5 November 2026

హెల్త్ సెంటర్లలో ఆరోగ్య మేళాలు

 

 

 

 

 

వేమనపల్లి,ఏప్రిల్ 14,(జనంసాక్షి):ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య సంరక్షణ 5వ  దినోత్సవాన్ని పురస్కరించుకొని వైద్యాధికారి రాజేష్ ఆధ్వర్యంలో అందరి ఆరోగ్యం శ్రేయస్సు కొరకు శుక్రవారం వేమనపల్లి మండలం జిల్లెడ, ముల్కలపేట్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లలో ఆరోగ్య మేళాలు నిర్వహించారు. బీపీ,షుగర్ పరీక్షలు నిర్వహించి, పాటించవలసిన ఆహారపు అలవాట్లు,యోగ,మెడిటేషనులతో లాభాలను వివరించారు.ఈ కార్యక్రమంలో సర్పంచులు కొండాల్ రెడ్డి,బెడ్డల రాజలింగు,సూపర్వైజర్ సరోజ,రాంశెట్టి బాపు,శ్రీవాణి,కీర్తి విజయలక్ష్మి,మంజుల,శ్రీలత,ఆశ కార్యకర్తలు గీత,సుమలత,లక్శ్మి,పద్మ,పంచాయతీ సిబ్బంది,ప్రజలు పాల్గొన్నారు.