హైదరాబాద్: నగరంలోని రాజ్‌భవన్‌లో దీపావళి వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ వేడుకల్లో గవర్నర్ దంపతులు పాల్గొన్నారు. ఉదయం 11 గంటల నుంచి వారు పుర ప్రముఖులను, ప్రజలను కలిసి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది.
కాన్వాయ్ ఆపి ట్రాఫిక్ పోలీసులకు విషెస్..
రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్ సమక్షంలో దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. నిన్న గవర్నర్ నరసింహన్ దీపావళి వేడుకల్లో పాల్గొనేందుకు తన కాన్వాయ్‌లో బయలుదేరారు. కాన్వాయ్ ఖైరతాబాద్ జంక్షన్ మీదుగా వెళ్తుంది. ఖైరతాబాద్ జంక్షన్‌లో ట్రాఫిక్ పోలీసులు విధులు నిర్వర్తిస్తున్నారు. ట్రాఫిక్ పోలీసులను చూసిన గవర్నర్ వెంటనే కాన్వాయ్‌ను నిలిపేశారు. వాహనంలో నుంచి దిగి అక్కడున్న ట్రాఫిక్ పోలీసులందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. గవర్నర్ నేరుగా తమ వద్దకు వచ్చి శుభాకాంక్షలు తెలుపడంతో ట్రాఫిక్ పోలీసులు సంతోషం వ్యక్తం చేశారు.




