Thursday, 5 November 2026

రాజ్ భవన్ ముట్టడి విజయవంతం చేయండి

రాజ్ భవన్ ముట్టడి విజయవంతం చేయండి.
– సిపిఐ బెల్లంపల్లి నియోజకవర్గ ఇంచార్జి రేగుంట చంద్రశేఖర్.
బెల్లంపల్లి, డిసెంబర్ 5, (జనంసాక్షి )
డిసెంబర్ 7నా చేపట్టిన చలో రాజ్ భవన్ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సిపిఐ బెల్లంపల్లి నియోజకవర్గ ఇన్చార్జి రేగుంట చంద్రశేఖర్ పిలుపునిచ్చారు.
సోమవారం బెల్లంపల్లి నియోజకవర్గం తాండూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గవర్నర్ వ్యవస్థ బ్రిటిష్ కాలం నుండి వస్తున్నదని, ప్రజాతంత్ర ప్రభుత్వాలు లేకుండా పరిపాలన సాగిస్తున్న క్రమంలో స్వాతంత్రం వచ్చిన తరువాత కూడా ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వం గత ఎనిమిదేళ్ల నుండి ఈ గవర్నర్ వ్యవస్థను ఏజెంట్లుగా మార్చుకొని దేశవ్యాప్తంగా బిజెపియేతర రాష్ట్ర ప్రభుత్వాలను కూలదోస్తుందని, బీజేపీయేతర రాష్ట్రాలు అయిన కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, ఢిల్లీ, తెలంగాణ లాంటి రాష్ట్రాలలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని కూలదోస్తు, ఆ ప్రభుత్వాన్ని పడగొడుతూ మత విద్వేషాలు రెచ్చగొట్టే కుట్రలో భాగంగా గవర్నర్ వ్యవస్థ పని చేస్తున్నదన్నారు. అంతేకాకుండా ఆయా రాష్ట్రాల అభివృద్ధిలో భాగంగా ప్రవేశపెట్టిన బిల్లులను కూడా ఆమోదించకుండా బిజెపి ప్రభుత్వం చేతుల్లో బలి కావాల్సి వస్తుందన్నారు. ఈసమావేశంలో సిపిఐ నాయకులు పాల్గొన్నారు.