– ఉస్మానియాను బ్రష్టు పట్టించింది కాంగ్రెస్ పార్టీ కాదా?
– ఫ్యాన్‌లు, బాత్రూంలు లేకుండా హాస్టళ్లను నడిపిందెవరు
– తప్పుడు మాటలు వద్దు.. నిర్మాణాత్మక సలహాలివ్వండి
– కాంగ్రెస్ సభ్యులకు చురకలంటిచిన సీఎం కేసీఆర్
హైదరాబాద్, నవంబర్16(జనంసాక్షి) : తెలంగాణాలోని అన్ని వర్గాల అబివృద్ధికి తెరాస ప్రభుత్వం కృషి చేస్తుందని, ఆమేరకు ఒక్కో అడుగు వేస్తున్నామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.. రాత్రికి రాత్రే బంగారు తెలంగాణ సాధ్యం కాదని.. అలా అనుకుంటే ఇన్నేళ్లుగా కాంగ్రేసోళ్లు ఏం చేశారని కేసీఆర్ ప్రశ్నించారు.. గురుకుల పాఠశాలలు, విద్యాసంస్థల్లో మౌలిక సదుపాయాలపై శాసనసభలో చర్చ జరిగింది. ఈ సందర్భంలో కాంగ్రెస్ శాసనసభ్యుడు కోమటి రెడ్డి వెంకటరెడ్డి అడిగిన ప్రశ్నలకు సీఎం కేసీఆర్ జవాబు ఇచ్చారు. సమైక్య రాష్ట్రంలో మేం ఏవిూ చేయలేకపోయినమని, అన్ని రంగాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని వెంకట్‌రెడ్డి ఒప్పుకున్నారన్నారు. రాత్రికి రాత్రే బంగారు తెలంగాణ సాధ్యమైతదా అని సీఎం ప్రశ్నించారు. విూ హయాంలోనే బాత్రూంలు, ఫ్యాన్లు లేకుండా హాస్టళ్లు నడిపారని ఎద్దేవా చేశారు. ఉస్మానియా యూనివర్సిటీని భ్రష్టు పట్టించిందే కాంగ్రెస్ కాదా అని ప్రశ్నించారు. సొంత రాష్టాన్న్రి మనకు మనమే శాపించుకోవడం మంచిది కాదని హితవు పలికారు. మహిళల కోసం మొత్తం 30 గురుకుల కాలేజీలు ఏర్పాటు చేశామన్నారు. తప్పుడు వ్యాఖ్యలు చేయ్యద్దు.. నిర్మాణాత్మక సలహా ఇవ్వండి స్వీకరిస్తామని తేల్చిచెప్పారు. గురుకుల పాఠశాలలకు 2027 నాటికి 8వేల 700 కోట్ల ఖర్చు అవుతుందని వివరించారు. బంగారు తెలంగాణ దిశగా వెళ్తున్నామన్న సీఎం.. విూకు కనబడకుంటే మేము ఏం చేస్తామని పేర్కొన్నారు. కారుచీకట్ల తెలంగాణను వెలుగులమయం చేసింది నిజం కాదా అని సీఎం ప్రశ్నించారు. రాబోయే రోజుల్లో ప్రతి మండలానికి ఒక గురుకుల పాఠశాల ఏర్పాటు చేస్తామన్నారు. హాస్టళ్ల కోసం కలెక్టర్ల వద్ద పైసలు పెట్టామని, అన్ని వసతులు కల్పిస్తూ వారికి అండగా నిలుస్తున్నామని సీఎం స్పష్టం చేశారు.
రాత్రికిరాత్రే బంగారు తెలంగాణ సాధ్యంకాదు




