
రుద్రూర్ (జనంసాక్షి): రుద్రూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రాంగణంలో స్ట్రీట్ లైట్లు గురువారం నుండి వెలుగకపోవడం వలన బస్టాండ్ ప్రాంగణం మొత్తం అంధాకారంగా మారింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి బస్టాండ్ ప్రాంగణంలోని స్ట్రీట్ లైట్లకు మరమ్మతులు చేయించాలని పలువురు కోరుతున్నారు. అలాగే తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతిలో భాగంగా ఇంటి ఇంటి కి చెత్త సేకరించే చెత్త బండిలు రాక గ్రామ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు , ప్రతీ రోజు చెత్తాను సేకరించడానికి గ్రామ పంచాయతీ ట్రాక్టరే వస్తుందని అది ప్రధాన రహదారి గుండానే వెళ్తుందని , మరి వీధులలో, సందు గొందులలో వుండే పేద వారి ఇంటికి చెత్త బండిలు వెళ్ళటం లేదని ప్రజలు వాపోతున్నారు, గ్రామ పంచాయితీ కి వెళ్లి అడిగిన చెత్తా బండిలు మరమ్మతులో ఉంది అని సమాదానం ఇస్తున్నారని నెలల తరబడి చెత్త బండిలు మరమ్మతులు కావ అని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వలు , ప్లాస్టిక్ వాడకాన్ని నిషేదించి యుద్ధ ప్రాతిపదికన అమలు చేస్తే రుద్రూర్ మండల కేంద్రంలో మాత్రం పోస్టర్ లలో, మైక్ లలో ప్రచారం చేయటం తప్ప , ప్లాస్టిక్ ను వాడుతున్న వ్యాపార సముదాయలపై చర్యలు తీసుకోకుండా ఉండటం పై గ్రామ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికైనా, గ్రామ అధికారులు, పాలకులు తగిన చర్యలు తీసుకోవలని కోరుతున్నారు




