Wednesday, 4 November 2026

రానున్నది బహుజన రాజ్యమే –బీఎస్పీ రాష్ట్ర అధికార ప్రతినిధి అరుణ క్వీన్

రానున్నది బహుజన రాజ్యమే –బీఎస్పీ రాష్ట్ర అధికార ప్రతినిధి అరుణ క్వీన్.

జహీరాబాద్ జనవరి 4( జనంసాక్షి)రానున్నది బహుజన రాజ్యమే అని బీఎస్పీ రాష్ట్ర అధికార ప్రతినిధి అరుణ క్వీన్ అన్నారు. బుధవారం జహీరాబాద్ పట్టణంలో బిఎస్పీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించిన అనంతరం పార్టీ జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా సంగారెడ్డి జిల్లా మహిళా కన్వీనర్ పల్లవి సంగారెడ్డి జిల్లా జనరల్ సెక్రెటరీ బాలన్న జహీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జ్ శశికాంత్ గిరికల జహీరాబాద్ అధ్యక్షుడు సుధీర్ లతో కలసి మాట్లాడుతూ బి ఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ఫోన్ ట్యాపింగ్ చేయడం ఒక పిరికిపంద చర్య అన్నారు. బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు ఎలాంటి హాని జరిగిన ఊరుకునేది లేదు అన్నారు. రాష్ట్రమంతా ఒక అగ్నిగుండంలా మారుస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఇంఛార్జి సతీష్ జహీరాబాద్ పట్టణ అధ్యక్షులు బాబన్న జహీరాబాద్ అసెంబ్లీ బివిఎఫ్ కన్వీనర్ శ్రీనివాస్ నాయకులు సింగారం ఓం ప్రకాష్ బుచ్చయ్య,పండరి,తుక్కరం,పవన్, నరసింహ బహుజన్ సమాజ్ పార్టీ అభిమానులు తదితరులు పాల్గొన్నారు.