Tuesday, 3 November 2026

సావిత్రిబాయి పూలే రాష్ట్రస్థాయి అవార్డును స్వీకరించిన ఉమెన్స్ టీచర్స్ ను సన్మానించిన కొండమల్లేపల్లి జడ్పిహెచ్ఎస్ ప్రధానోపాధ్యాయులు మంద సత్యనారాయణ

సావిత్రిబాయి పూలే రాష్ట్రస్థాయి అవార్డును స్వీకరించిన ఉమెన్స్ టీచర్స్ ను సన్మానించిన కొండమల్లేపల్లి జడ్పిహెచ్ఎస్ ప్రధానోపాధ్యాయులు మంద సత్యనారాయణ కొండమల్లేపల్లి జనవరి 4 జనం సాక్షి న్యూస్ : సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా సావిత్రిబాయి పూలే అవార్డును స్వీకరించి రాష్ట్రస్థాయి బెస్ట్ ఉమెన్స్ టీచర్ అవార్డు హైదరాబాద్ రవీంద్ర భారతిలో సన్మానించడం జరిగిందని ఈ ప్రోగ్రాం నిర్వాహన BCTU రాష్ట్రస్థాయి సంఘం వారి యొక్క సౌజన్యంతో రాష్ట్రస్థాయిలో హైదరాబాదులో అవార్డు పొందిన సౌజన్య మరియు కవిత టీచర్స్ ను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు మంద సత్యనారాయణ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించడం జరిగినది ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మంద సత్యనారాయణ మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే, భారతీయ సంఘ సంస్కర్త, ఉపాధ్యాయిని, రచయిత్రి. ఆమె నిమ్న వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన జ్యోతిరావు పూలే భార్య. కులమత భేదాలకు అతీతంగా సమాజాన్ని ప్రేమించిన ప్రేమస్వరూపిణి. ఆధునిక విద్య ద్వారానే స్త్రీ విముక్తి సాధ్యపడుతుందని నమ్మిన ఆమె, తన భర్తతో కలసి 1848 జనవరి 1న పూణేలో మొట్టమొదటగా బాలికల పాఠశాలను ప్రారంభించింది. కుల వ్యవస్థకు, పితృస్వామ్యానికి వ్యతిరేకంగా, శూద్రుల, అస్పృశ్యుల, మహిళల సకల హక్కుల కోసం పోరాటం చేయటం తమ సామాజిక బాధ్యతగా ఆ దంపతులు విశ్వసించారు. నూతన వ్యవస్థ కోసం, ప్రాణాల్ని సైతం పణంగా పెట్టి సమష్టిగా పోరాటం చేసింది. సమాజంలోని కులతత్వం, పురుషాధిక్య ధోరణులు కలిగిన చాలామంది పండిత మేధావులందరికీ కూడా ఆమె కేవలం జ్యోతిరావు ఫూలే భార్యగా మాత్రమే తెలుసు. కానీ ఆమె ఆధునిక భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు. పీడిత ప్రజలు ముఖ్యంగా స్త్రీల విద్యాభివృద్ధికి కృషి చేసిన తొలితరం మహిళా ఉద్యమకారిణి అని ఇంత గొప్ప మహిళా సావిత్రిబాయి పూలే అవార్డు రావడం మా పాఠశాల టీచర్స్ కి మరియు సహకరించిన ఉపాధ్యాయులకు విద్యార్థిని విద్యార్థులకు హృదయపూర్వక శుభాకాంక్షలు అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో చేరుపల్లి శ్రీనివాస్, శ్రీనయ్య, కొర్ర లోక్య నాయక్, దేవకుమార్, అశోక్ రెడ్డి, నరసింహ చారి, చంద్రయ్య, జనార్దన్ రెడ్డి, జగదీష్, శ్రీపతిరావు, అక్కిరెడ్డి, వెంకటేశ్వర్లు, నల్ల నరసింహ, సూర్య, సైదా నాయక్, ఈదయ్య గౌడ్, అజహాన్ అలీ, లింగారెడ్డి,పి జే నరసింహారావు, సీతారాం, నాగరాజు, కలమ్మ, సౌజన్య, ఉమామహేశ్వరి, సరస్వతి,సంపత్ కుమార, లక్ష్మయ్య, గిరి, శ్రీను, గోవర్ధన్ రెడ్డి,మంజుల,సమ్రీన్ మరియు విద్యార్థినీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు