9 నెలల కాలంలో ఆల్‌టైం రికార్డుగా 23,225 కోట్ల టర్నోవర్ సాధించిన సింగరేణి……..9 నెలల కాలంలో ఆల్‌టైం రికార్డుగా 23,225 కోట్ల టర్నోవర్ సాధించిన సింగరేణి……..గతఏడాదిపై 23 శాతం వృద్ధిఈ వార్షికాంతానికి 34 వేల కోట్ల టర్నోవర్ దిశగా సింగరేణి……ప్రకటించిన సంస్థ ఛైర్మన్, ఎండీ ఎన్.శ్రీధర్………సింగరేణి సంస్థ ఈ ఆర్థిక సంవత్సరం డిసెంబరు నెలతో ముగిసిన మూడో త్రైమాసికాంతానికి ఆల్ టైం రికార్డుగా 23, 225 కోట్ల రూపాయల టర్నోవర్ ను సాధించిందని సంస్థ ఛైర్మన్ మరియు ఎండీ ఎన్.శ్రీధర్ బుధవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలానికి సింగరేణి సాధించిన 18,956 కోట్ల రూపాయల టర్నోవర్ పై ఇది 23 శాతం అధికమని పేర్కొన్నారు. గత ఆర్థిక సంవత్సరం 2021-22 లో సింగరేణి వార్షిక టర్నోవర్ 26, 619 కోట్ల రూపాయలు కాగా, ఈ ఆర్థిక సంవత్సరాంతానికి సంస్థ టర్నోవర్ రూ.34 వేల కోట్ల కు చేరుకునే అవకాశాలు ఉన్నాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. సింగరేణి టర్నోవర్ -2022-23(డిసెంబరు 31 నాటికి )క్రమసంఖ్య.ఏప్రిల్-డిసెంబరు 2022 2021 వృద్ధి శాతం1 బొగ్గు అమ్మకాలు ద్వారా రూ.19,934 కోట్లు రూ.16,084 కోట్లు 242 విద్యుత్ అమ్మకాల ద్వారారూ.3,291 కోట్లు రూ.2,872 కోట్లు 153 మొత్తం రూ .23,225 కోట్లు రూ .18,956 కోట్లు 23సింగరేణి సంస్థ ఈ డిసెంబరుతో ముగిసిన మూడవ త్రైమాసికం చివరి నాటికి సాధించిన మొత్తం టర్నోవర్ లో బొగ్గు అమ్మకం ద్వారా రూ.19,934 కోట్లు, విద్యుత్ అమ్మకాల ద్వారా రూ.3,291 కోట్ల టర్నోవర్ సాధించిందని వెల్లడించారు. ఈ విధంగా గతేడాది సాధించిన బొగ్గు అమ్మకాలపై 24 శాతం వృద్ధిని, విద్యుత్ అమ్మకాలపై 15 శాతం వృద్ధిని నమోదు చేశామన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి 9 నెలల కాలంలో సింగరేణి 472 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తిని, అదే పరిమాణంలో బొగ్గు రవాణాను జరిపిందని, ఇదే ఒరవడితో వార్షికాంతానికి సుమారు 700 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి, రవాణా జరిగే అవకాశాలు ఉన్నాయన్నారు. తద్వారా రికార్డు స్థాయిలో రూ.34 వేల కోట్లకు పైగా టర్నోవర్ సాధించనున్నామని ఆయన వివరించారు. -జనం సాక్షి – హైదరాబాద్
9 నెలల కాలంలో ఆల్‌టైం రికార్డుగా 23,225 కోట్ల టర్నోవర్ సాధించిన సింగరేణి




