Wednesday, 4 November 2026

రాబోయే ఎన్నికల్లో బి ఆర్ ఎస్ దే విజయం :మంత్రి మల్లారెడ్డి

 

 

 

 

 

 

 

 

:శామీర్ పేట్ జనం సాక్షి : ప్రజల సంక్షేమం కోసమే బి ఆర్ ఎస్ ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుందని మంత్రి మల్లారెడ్డి అన్నారు. మంగళవారం తుంకుంట మున్సిపాలిటీ లోని జెన్వి కన్వెన్షన్ హల్ లో బి ఆర్ ఎస్ పార్టీ నియోజక వర్గ ప్రజా ప్రతినిధుల సమావేశానికి మంత్రి మల్లారెడ్డి ముఖ్య అతిధిగా విచ్చేసి పార్టీ జెండా ఆవిష్కరించి మాట్లాడారు.ఈ కార్యక్రమంలో నాయకులు నందా రెడ్డి, మధుకర్ రెడ్డి, జహంగీర్,కావ్య, రాజేశ్వర్ రావు, శ్రీనివాస్ రెడ్డి, చంద్ర శేఖర్ యాదవ్,మేడ్చల్ నియోజకవర్గ బి ఆర్ ఎస్ పార్టీ కార్పొరేటర్లు, కౌన్సిల్లర్లు,ప్రజాప్రతినిధులు, సర్పంచ్,లు పార్టీ అధ్యక్షులు, మండల, గ్రామ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.