Wednesday, 4 November 2026

శ్రీధర్ బాబు పై నిరాధారమైన వార్త ప్రచురించిన పత్రిక పై చట్టపరంగా చర్యలు తీసుకోవాలి – కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైనాల రాజు ఆధ్వర్యంలో కమాన్ పూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు

 

 

 

 

 

 

 

జనంసాక్షి , కమాన్ పూర్ : రిజిస్టర్ లేని, నిబద్ధతలేని ఓ వార్తాపత్రికలో ఏఐసిసి సెక్రటరీ, మంథని శాసనసభ్యులు శ్రీధర్ బాబు పై ఎటువంటి ఆధారం లేని, నిరాధారమైనటువంటి ఆరోపణలను ప్రచురితం చేసినటువంటి సదరు వార్తాపత్రిక యాజమాన్యం, అట్టి న్యూస్ కవరేజ్ చేసినటువంటి విలేకరిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరుతూ కమాన్ పూర్ మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన మంగళవారం కమాన్పూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వైనాల రాజు తెలిపారు. మంగళవారం కమాన్ పూర్ ప్రెస్ భవన్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. శ్రీధర్ బాబుపై చేసినటువంటి అసత్యపు ప్రచారాలను, అబద్ధాల పుట్ట నుంచి వ్రాసినటువంటి నిరాధార ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఎవరెస్టు శిఖరం అంత ఎత్తు పైనున్న శ్రీధర్ బాబు ప్రతిష్టలు దిగజార్చే ప్రయత్నం చేయడం పిరికి చర్య అని అన్నారు. మంథని నియోజకవర్గ ప్రజల మనసు గెలవాలంటే అభివృద్ధి చేయాలే తప్ప మంథని ప్రజల గుండెల్లో కొలువై ఉన్న శ్రీధర్ బాబు పై తప్పుడు ఆరోపణలు చేయడం మానుకోవాలని హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి రంగు సత్యనారాయణ గౌడ్, జూలపల్లి ఎంపిటిసి శివ శంకర్, గుండారం గ్రామ శాఖ అధ్యక్షుడు పిడుగు శంకర్ , నాయకులు సయ్యద్ ఇక్బాల్, రఫిక్ , చొప్పరి శేఖర్, అప్సర్, కుక్క రవి, పెండ్యాల రాజు , బొజ్జ సతీష్, బిల్ల కృష్ణ, ఇరుగురాల శేఖర్, రాయమల్లు తదితరులు పాల్గొన్నారు.