రామకృష్ణ సంకీర్తన మండలి ఆధ్వర్యంలో శ్రీ భాగవత సప్తాహం
మెట్పల్లి, జనవరి 15, జనంసాక్షి :
మెట్పల్లి మండలం వేంపేట గ్రామంలో శ్రీ రామకృష్ణ సంకీర్తన మండలి ఆధ్వర్యంలో శ్రీ భాగవత సప్తహం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన శ్రీ సత్యానంద ఆశ్రమ పీఠాధిపతులు ఆచార్య శ్రీహరి తీర్థ స్వామి నారద భక్తి సూత్రములపై ఈరోజు క్లప్తంగా వివరించారు. ఈ సందర్భంగా స్వామి మాట్లాడుతూ ప్రహ్లాదుడు, తుకారం, మీరాబాయి, నారదుడు ఎలా తరించారో వివరంగా తెలిపినారు. నిరంతరం భగవాన్ నామ స్మరణ చేసిన మనసు ప్రశాంతంగా ఉంటుందని సమస్యలు తొలగిపోతాయని తెలిపినారు. ఈరోజుతో ఇట్టి భాగవత సప్తాహం సమాప్తమైంది అనంతరం వనభోజనాల కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో 500 మంది భక్తులు పాల్గొన్నారు. ఇట్టి కార్యక్రమంలో శివరామకృష్ణ తపోవనం స్వామి, విరజానంద తీర్థ సేవా భారతి హైదరాబాద్ స్వామి, అశోక తీర్థ స్వామి, రామకృష్ణ సంకీర్తన మండలి కమిటీ సభ్యులు, రామాలయ ఆలయ కమిటీ సభ్యులు,మహిళలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు
రామకృష్ణ సంకీర్తన మండలి ఆధ్వర్యంలో శ్రీ భాగవత సప్తాహం




