Thursday, 5 November 2026

రామానాయుడికి కెసిఆర్, బాబు, ప్రముఖుల నివాళి

1 హైదరాబాద్ జ‌నంసాక్షి : ప్రముఖ నిర్మాత, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత రామానాయుడి పార్థీవ దేహానికి తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు గురువారం నివాళులర్పించారు. రామానాయుడు స్టూడియోలో ఆయన పార్థీవ దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. రామానాయుడు పెద్ద కుమారుడు సురేష్ బాబును కెసిఆర్ ఆలింగనం చేసుకుని ఓదార్చారు. రామానాయుడు కుటుంబసభ్యులను ఆయన పరామర్శించారు. సిఎం కెసిఆర్ తోపాటు ఎంపి కె కేశవరావు, హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, టిఆర్ఎస్ నేతలు కూడా రామానాయుడి పార్థీవ దేహానికి నివాళుర్పించారు. రామానాయుడికి కెసిఆర్, బాబు, ప్రముఖుల నివాళి(పిక్చర్స్) అంతకుముందు మంత్రి కె తారక రామారావు, రాజకీయ ప్రముఖులు జానారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, రాయపాటి సాంబశివరావు, గాదె వెంకట రెడ్డి, కనుమూరి బాపిరాజు, సిపిఐ నేత నారాయణ, తదితరులు నివాళులర్పించారు. ప్రభుత్వ లాంఛనాలతో గురువారం సాయంత్రం రామానాయుడి అంత్యక్రియులు జరగనున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *