రాములోరి భూములను ఆక్రమణదారుల నుండి కాపాడుతాం :
తూంకుంట మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో దేవదాయ ధర్మాదాయ శాఖ ఉప కమిషనర్ :శామీర్ పేట్, జనం సాక్షి :
తూంకుంట మున్సిపాలిటీ పరిధిలోని దేవరయాంజాల్ లో దేవాదాయ శాఖకు సంబంధించిన సర్వే నెంబర్లు 639,640 లలో సుమారు 15 ఎకరాల భూమిలో వందలాది మంది స్థానికేతరులు కబ్జా చేసి గతంలో గుడిసెలు వేసి,ఇప్పుడు అక్రమంగా
రోజూ ఇళ్ళ నిర్మాణాలు చేపడుతున్నారని, వాటిని వెంటనే తొలగింపజేసి కబ్జాకు గురవుతున్న భూమిని కాపాడాలని హైద్రాబాద్ లోని దేవాదాయ ధర్మాదాయ శాఖ కార్యాలయంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉప కమిషనర్ రామకృష్ణా రావుని కలిసి తూంకుంట కాంగ్రెస్ పార్టీ నాయకులు వినతి పత్రం ఇవ్వడం జరిగింది,ఈ సందర్భంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉప కమిషనర్ రామకృష్ణా రావు మాట్లాడుతూ ఈ విషయమై మేము పలుమార్లు చర్చించామని త్వరలోనే చర్యలు తీసుకుంటామని తెలిపారు,దేవాదాయ ధర్మాదాయ శాఖ భూమిని కాపాడాల్సిన బాధ్యత మా పైనే ఉందని దేవాదాయ ధర్మాదాయ శాఖ కి సంబంధించిన భూమిలో ఎంతమంది ఎన్ని ఇండ్లు కట్టినా వాటన్నిటిని తొలగించి రాములోరి భూమి కాపాడుతామని అన్నారు.
దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉప కమిషనర్ రామకృష్ణా రావుని కలిసిన వారిలో తూంకుంట మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జైపాల్ రెడ్డి,మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు మురళి గౌడ్,రాము,మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ ఓబిసి సెల్ అధ్యక్షులు లక్ష్మీనారాయణ,హకీంపేట్ 9 వార్డు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్, ప్రధాన కార్యదర్శి మల్లేశ్,సీనియర్ కాంగ్రెస్ నాయకులు దుర్గయ్య, యూత్ కాంగ్రెస్ నాయకులు గౌతమ్ గౌడ్ తదితరులు ఉన్నారు.
3ఎస్పీటీ -2: వినతి పత్రం అందజేస్తున్న నాయకులు




