హైదరాబాద్ : రాయలసీమను మ్కులు చేసే హక్కు సోనియాకు లేదని రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర్రెడ్డి అన్నారు. సీమను ముక్కలు చేస్తే ఆ ప్రాంత వాసులు చూస్తూ ఉండరని ఆయన పేర్కొన్నారు. రాయలసీమను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించాలన్న డిమాండుతో ఇందిరా పార్కు వద్ద జరుగుతున్న 52 గంటల సింహగర్జన దీక్ష కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రాన్ని శాసించే నేతలు రాయలసీమలో ఉన్నారని, ముక్కలవుతున్న రాయలసీమను ఆ నాయకులు పట్టించు కోవడంలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాయలసీమలోని నాలుగు జిల్లాల నుంచి ప్రజలు ఈ దీక్షా శిబిరానికి తరలివచ్చారు. రాయలసీమలోని 52 నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ముక్కలవుతున్న సీమను అడ్డుకోకపోతే ప్రజలు తిరగబడతారని బైరెడ్డి హెచ్చరించారు.




