Monday, 2 November 2026

రావి ఆకు రూపంలో భారతరత్న

nntn8hk7హైదరాబాద్ : భారతరత్న అవార్డు మన దేశ అత్యున్నత పౌర పురస్కారం. మరీ ఈ అవార్డు ఏ రూపంలో ఉంటుంది? ఎవరికి ఇస్తారు? ఎప్పుడు ప్రారంభమైంది? ఇప్పటి వరకు ఎంత మంది ఈ అవార్డును అందుకున్నారు? వివరాల్లోకి వెళ్తే భారతరత్న రావి ఆకు రూపంలో ఉంటుంది. దీనిపై దేవనాగరి లిపిలో భారతరత్న అని రాసి ఉంటుంది. మధ్యలో ప్రకాశిస్తున్న సూర్యుడి బొమ్మ కూడా ఉంటుంది. ఎవరికి ఇస్తారంటే.. ప్రజా సేవ, శాస్త్ర సాంకేతిక, ప్రభుత్వ సేవలు, కళలు మొదలైన అంశాలలో భారతరత్నను అందజేస్తారు.

1954లో భారతరత్నను ఇవ్వడం ప్రారంభించారు. అయితే 1977లో జనతా ప్రభుత్వం భారతరత్న అవార్డుల ఎంపికను రద్దు చేసింది. తిరిగి మళ్లీ 1980లో కాంగ్రెస్ ప్రభుత్వం అవార్డుల ఎంపికను పున:ప్రారంభించింది. 2013 వరకు భారతరత్నను 44 మందికి ప్రకటించారు. 2014 సంవత్సరానికి గానూ మదన్ మోహన్ మాలవ్యకు, మాజీ ప్రధాని వాజ్‌పేయీకి భారతరత్నను ప్రకటించారు. భారతరత్నను అందుకున్న తొలి వ్యక్తి సి. రాజగోపాలాచారి. తొలి ప్రధాని నెహ్రూ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *