రాష్టాన్న్రి అవినీతి మయం చేశారు
– 70శాతం ప్రజలకు డబ్బులివ్వందే పనులుకావట్లేదు
– పరమత సహనంగురించి కేటీఆర్ మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది
– కాళేశ్వరం జాతీయ ¬దాపై ఇప్పటివరకు డీపీఆర్ ఇవ్వలేదు
– ఆర్టికల్ 370 చేసినట్లుగానే తెలంగాణ విమోచన జరిపితీరుతాం
– హైదరాబాద్‌ను యూటీ చేయాలన్న ఆలోచన లేదు
– పాత, కొత్తనేతలమంతా కలిసి రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తెస్తాం
– బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్
కరీంనగర్, ఆగస్టు17(జనంసాక్షి ) : రాష్టాన్న్రి అభివృద్ధిచేస్తారని అధికారమిస్తే.. సీఎం కేసీఆర్, తెరాస నేతలు రాష్టాన్న్రి అవినీతి మయంగా మార్చారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ విమర్శించారు. శనివారం ఆయన కరీంనగర్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా ¬టల్ మైత్రీలో మాజీ ఎంపీ వివేక్, ఎంపీ బండి సంజయ్, మాజీ మంత్రి పెద్దిరెడ్డిలతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అవినీతిలో తెలంగాణ రెండో స్థానంలో ఉందని దేశమంతటా జరిగిన ఓ సర్వేలో తేలిందన్నారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ.. కల్వకుంట్ల కుటుంబం పాలైందన్నారు. 70శాతం ప్రజలకు డబ్బులు ముట్టజెప్పందే పని కావడం లేదన్నారు. ప్రాజెక్టుల్లో కవిూషన్ల రూపంలో వచ్చిన అవినీతి డబ్బును ఎన్నికల్లో ఉపయోగించారనీ, పేదల సంక్షేమం స్కీంలన్నింటిలోనూ స్కాంలే ఉన్నాయన్నారు. చంద్రబాబును బూచిగా చూపి అధికారంలోకి వచ్చారని లక్ష్మణ్ విమర్శించారు. కరీంనగర్ లో గ్రానైట్, ఇసుక మాఫియా సహజ సంపదను దోచేస్తోందని అన్నారు. రూ.1500 కోట్ల ఆరోగ్య శ్రీ బకాయిలను ప్రభుత్వం చెల్లించలేదు కాబట్టే.. హాస్పిటళ్లలో వైద్య సేవలు నిలిచిపోయాయని లక్ష్మణ్ అన్నారు. సెక్రటేరియట్ కూల్చి రూ.500 కోట్లు ఖర్చు చేస్తామంటున్న ప్రభుత్వానికి పేదల ఆరోగ్యం అక్కర లేదా? అని ప్రశ్నించారు. తెలంగాణలో చీకటి రాజ్యం నడుస్తోందన్నారు. సమాచార హక్కును కాలరాసే విధంగా 1457 జీవోలను వెబ్ సైట్ లో ఉంచడం లేదన్నారు. అధికార టీఆర్‌ఎస్ భవనాల కోసం ప్రభుత్వ భూములను ఎకరా రూ.100 చొప్పు అప్పనంగా కట్టబెట్టారని అన్నారు. దళితులకు మూడెకరాల భూమి, డబుల్ బెడ్ రూం ఇళ్ళు ఏమయ్యాయని ప్రశ్నించారు. కాళేశ్వరంపై పూర్తి డీపీఆర్ లేకుండానే రంగుల సినిమా చూపిస్తున్నారని లక్ష్మణ్ విమర్శించారు. రాష్ట్రంలో విద్యారంగాన్ని బ్రష్టు పట్టించారని లక్ష్మణ్ విమర్శించారు. ఎంసెట్, ఇంటర్ పరీక్షల నిర్వహణ తప్పుల తడకగా మారిందన్న లక్ష్మణ్.. 27 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని అన్నారు. కేంద్రం నివేదిక అడిగితే సీఎం కేసీఆర్ అది పెద్దకుట్ర అంటున్నారని అన్నారు. గ్లోబరినాపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. 16 మంది సీఎంలు చేసిన అప్పు రూ.62 వేల కోట్లయితే ఒక్క కేసీఆర్ రూ.2 లక్షల కోట్లు అప్పు చేసి రాష్టాన్న్రి అప్పులపాలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్ అవినీతి పాలనకు చరమ గీతం పాడాల్సి ఉందన్నారు. ఇందుకు బీజేపీ వేదికగా భావించి చాలా మంది పార్టీలో చేరారన్నారు. వివేక్ కు టీఆర్‌ఎస్ ప్రభుత్వ సలహదారుగా పెట్టుకున్నారని గుర్తుచేసిన లక్ష్మణ్ తమ పార్టీలోకి వస్తే.. ఔట్ డేటెడ్ అంటారా అని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్ ను సమర్ధిస్తేనే తెలంగాణ వాదులు అనడం కరెక్ట్ కాదన్నారు. పరమత సహనం గురించి కేటీఆర్ మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుందని లక్ష్మణ్ అన్నారు. మోడీ బొమ్మపెట్టాల్సివస్తోందనే ఆయుస్మాన్ భారత్ అమలు చేయడం లేదన్నారు. ఫసల్ బీమా, ఆవాస్ యోజన లాంటివి తెలంగాణలో అమలు కావడం లేదన్నారు.
సెప్టెంబర్ 17 తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ దినమని, తెలంగాణ విలీన దినాన్ని సీఎం తొక్కిపెడుతున్నారని విమర్శించారు. అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై చర్యలు తప్పవని, ఆర్టికల్ 370రద్దు చేసినట్లుగానే.. తెలంగాణ విమోచన జరిపి తీరుతామని లక్ష్మణ్ స్పష్టం చేశారు. హైదరాబాద్ ను యూటీ చేస్తారన్న ప్రచారం జరుగుతోందని, అది ఎంతమాత్రం నిజం కాదని లక్ష్మణ్ అన్నారు. హైదరాబాద్ ను యూటీ చేయమని తెలిపారు. బీజేపీలో పాత, కొత్త నేతలమంతా కలిసి పార్టీని రాష్ట్రంలో అధికారంలోకి తెస్తామని, తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు బీజేపీయే ప్రత్యామ్నాయమని లక్ష్మణ్ పేర్కొన్నారు.